అనుష్క వల్లే ఆ సినిమా పోయిందట!

P.Nishanth Kumar
నందమూరి ఫ్యామిలీ హీరోలు అంటే వై.వి.యస్.చౌదరి కి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వారి పై ఉన్న అభిమానాన్ని, ప్రేమను వైవిఎస్ చౌదరి తన సినిమాల ద్వారా ఇప్పటికే చూపించారు. ఈ క్రమంలోనే ఆయన నందమూరి హీరో లతో వరుసగా సినిమాలు తీయగా వాటిలో కొన్ని హిట్ లు సాధించగా మరికొన్ని ఫ్లాప్ లుగా మిగిలాయి. అలా బాలకృష్ణ హీరోగా వైవీఎస్ చౌదరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఒక్క మగాడు.కమల్ హాసన్ భారతీయుడు సినిమా కాన్సెప్ట్ తరహా లో తెరకెక్కిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దేవదాసు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వై.వి.యస్.చౌదరి 2007లో బాలకృష్ణతో ఒక్కమగాడు అనే పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా అనగానే నందమూరి అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంది. సినిమా చిత్రీకరణ సమయంలో, రిలీజ్ ముంగిట ఈ సినిమా గురించి ఎంతో చర్చ జరగగా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తుంది అనే అంచనాల మధ్య ఆ తర్వాత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే వైవిఎస్ ఇలా చేశాడేంటి అని అతన్ని బాలయ్య అభిమానులు తిట్టిపోశారు.

ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన వై.వి.యస్.చౌదరి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడి వార్తల్లో నిలిచాడు. ఒక్క మగాడు కు ముందు బాలయ్య చేసిన కొన్ని సినిమాల్లో ఉన్న విపరీతమైన వయోలెన్స్, డబుల్ మీనింగ్ పాటలు, హీరోయిన్ ల గ్లామర్ లాంటి వల్ల ఆయన యూత్ దూరమైపోయారు అని, సోషల్ మీడియాలో ఆయన మీద విపరీతమైన కామెడీ నడిచిందని, అవేవీ లేకుండా డబుల్ మీనింగ్ డైలాగ్ లు లేకుండా సాంగ్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఒక కారణం కోసం తీసిన ఒక్క మగాడు సినిమా దెబ్బతిన్నదని చౌదరి అన్నాడు. అనుష్క హీరోయిన్ నటించిన ఈ సినిమాలో ఆమె పాత్రను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు అని అందువల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని కూడా చెప్పారు వైవీఎస్. ఆ సినిమా తర్వాత వై.వి.యస్.చౌదరి పరిస్థితి ఎలా తయారైందో మనందరం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటికీ ఆయన హిట్ సినిమా కాదు కదా కనీసం సినిమా కూడా చేయలేక పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: