బెల్లంకొండ బాబు ఎంటి మాకీ కన్ఫ్యూజన్?

P.Nishanth Kumar
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన గత చిత్రం అల్లుడు అదుర్స్ సినిమా ఫ్లాప్ గా నిలవడంతో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ప్రశ్నార్థకంగా మిగిలింది.. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో చాలా సార్లు ఉన్నా బెల్లంకొండ శ్రీనివాస్ ఓ హిట్ తో నెట్టుకొచ్చాడు.. కానీ ఈసారి సినిమా చేసే విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడడంతో ప్రేక్షకులు కూడా బెల్లంకొండ నుంచి ఏ సినిమా వస్తుందో అనే అయోమయంలో పడుతున్నారు.. టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా అల్లుడు శ్రీను సినిమా తో ప్రేక్షకులకు పరిచయమైనా శ్రీనివాస్ మొదటి సినిమా నుంచి పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోయిన్ లతో సినిమా చేస్తూ వచ్చాడు..
అయితే ఏ సినిమా కూడా ఆయనకు హిట్టు అందించలేదు.. రీమేక్ సినిమా రాక్షసుడు ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్.. ఆ సినిమా రీమేక్ అవడంతో దాంట్లో అయన కు ఎక్కువ గా క్రెడిట్ దక్కలేదు. సో ఇన్ని రోజులు సినిమాలు చేస్తూ వచ్చినా కూడా బెల్లంకొండ సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి.. ఈనేపథ్యంలో అయన బాలీవుడ్ కి వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ సినిమా అయినా ఛత్రపతి ని, టాలీవుడ్ డైరెక్టర్ అయినా వివి వినాయక్ తో బాలీవుడ్ లో నిర్మించడం ప్రేక్షకులకు కొత్తగా, వింతగా అనిపించింది.
అయితే ఆ సినిమా పట్టాలెక్కుతోంది అనుకున్న టైం లో కరోనా రావడం ఆ సినిమా కి బ్రేకులు పడడం చకచకా జరిగిపోయాయి. ఈనేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ మళ్ళీ టాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడనే వార్త అంతటా చర్చనీయాంశమైంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయినా కర్ణన్ సినిమా ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా తెరకెక్కబోతుంది అని వార్తలు వస్తుండగా ఈ సినిమా కి దర్శకుడిగా వివి వినాయక్ పేరు వినిపిస్తుండడంతో బాలీవుడ్ సినిమా పరిస్థితీ ఏంటి అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.. కానీ ఆ రీమేక్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ అతని డైరెక్షన్లో నే కర్ణన్ రీమేక్ కూడా చేస్తే కరెక్ట్ అని బెల్లంకొండ సురేష్ అండ్ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వస్తేనే కానీ కచ్చితంగా చెప్పలేము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: