కళ్యాణ్ రామ్ అదే తప్పు చేస్తున్నాడు.. బింబిసారా కష్టమే..!!

P.Nishanth Kumar
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన నాటి నుండి అయన చేసిన సినిమాల్లో హిట్ ల కన్నా ప్లాప్ లే ఎక్కువా.. అయన కెరీర్ మొత్తంలో అతనొక్కడే, పటాస్, 118 తప్పా పెద్దగా హిట్ అయినా సినిమాలేవీ లేవు అని చెప్పొచ్చు.. యావరేజ్ గా నిలిచినా చిత్రాలు కూడా ఎక్కువ లేవు.. కత్తి సినిమా తప్పా అయన చేసిన సినిమాలేవీ యావరేజ్ గా నిలువలేవు.. మిగితావన్ని అట్టర్ ప్లాప్ లు గా నిలిచాయి.. దాంతో ఈ సారి భారీ గ్యాప్ తీసుకుని మరీ ఓ హిస్టారికల్ సినిమా ని చేస్తున్నాడు.  

ఇటీవలే ఈ సినిమా కి సంబంధించి టైటిల్ ని కూడా రివీల్ చేశారు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర మేకర్స్.. బింబిసారా గా కళ్యాణ్ రామ్ తనదైన వెరైటీ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు.. నిర్మాతగా, హీరోగా భారీ ప్లాన్ తో ఈ సినిమాతో రాబోతున్నాడు కళ్యాణ్ రామ్.  ఈ సినిమాని కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుతుండగా ఆయన ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు కావడం విశేషం.

ఇకపోతే కళ్యాణ్ రామ్ ఈ సినిమా కి అయన గత సినిమాలకు చేసిన తప్పు చేస్తున్నాడని సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి సినిమాలు పెద్ద హీరోలు, దర్శకులు చేస్తేనే బాగుంటుంది. వాళ్లకే నప్పుతాయి. ఈ తరహా చిత్రాలకు బడ్జెట్లు భారీగా అవుతాయి. క్వాలిటీ పరంగా రాజీ పడితే కష్టం. అలాగని భారీ బడ్జెట్లు పెట్టాలంటే అందుకు తగ్గ మార్కెట్ హీరో, దర్శకుడికి ఉండాలి. కానీ కళ్యాణ్ రామ్ హీరోగా ఓ కొత్త దర్శకుడు ఇలాంటి భారీ సినిమా చేయడం అంటే చాలా పెద్ద రిస్కే. పైగా కళ్యాణ్ రామ్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ తరహా సినిమాలకు నప్పుతాయా అన్న డౌట్లూ ఉన్నాయి. చిన్న హీరోలు ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని కాదు కానీ.. రిస్క్ చాలా ఉంటుంది. ఈనేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఈ సినిమా ని ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: