బింబిసారా తెరకెక్కడానికి ఎన్ని తిప్పలు..!!

P.Nishanth Kumar
కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అనౌన్స్ చేసిన చిత్రం బింబిసారా. వశిష్ట్ అనే కొత్త దర్శకుడు  పరిచయమవుతున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ మోషన్ టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా ఆ టీజర్ కి ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ లు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అప్పుడెప్పుడో పటాస్ సినిమా ద్వారా పూర్తిస్థాయి మాస్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు అంటే కళ్యాణ్ రామ్ ఎంతలా వెనుకపడిపోయాడో అర్థం చేసుకోవచ్చు..

అయన గత చిత్రం ఎంతమంచివాడవురా చిత్రం దారుణమైన ప్లాప్ ని అందుకుంది.. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఆ సినిమా ఇంత దారుణంగా ప్లాప్ అయ్యేసరికి కొంత గ్యాప్ తీసుకుని మరీ కళ్యాణ్ రామ్ బింబిసారా అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ లుక్ లో కళ్యాణ్ రామ్ ను చూసిన వారు కళ్యాణ్ రామ్ ఇన్నాళ్లకు మంచి ప్రాజెక్ట్ తో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు అని నందమూరి అభిమానులు అంటున్నారు.. ఏదేమైనా కళ్యాణ్ రామ్ ఈ భారీ ప్రాజెక్ట్ తో పెద్ద సాహసమే చేస్తున్నాడు..

ఇకపోతే ఈ కథను ముందుకు కొంతమంది హీరోలు రిజెక్ట్ చేసినట్లు గా వార్తలు వస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్ అవడమే ఈ సినిమా పట్టాలెక్కకపోవడానికి కారణం అని తెలుస్తుంది.. హిస్టారిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏడెనిమిది వందల ఏళ్ల కిందటి నేపథ్యంలో కథ ఉంటుందని అప్పట్లో అల్లు శిరీష్ చెప్పారు ముందుగా అల్లు శిరీష్ మార్కెట్ పరిధుల్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. సినిమా కోసం ఓ భారీ దర్బార్ సెట్ కూడా వేయాలనుకున్నారు. కానీ అనుకున్నదానికంటే బడ్జెట్ దాటిపోయే అవకాశం ఉందని భావించిన అల్లు అరవింద్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నితిన్, రామ్ ల వద్దకు ఈ సినిమా కథ వెళ్లగా వారు ఈ సినిమా ను రిజెక్ట్ చేయగా కళ్యాణ్ రామ్ ని వరించింది ఈ సినిమా..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: