ఈసారి మిస్ అవదు..ఫ్యాన్స్ కి బాలయ్య బంపర్ ఆఫర్!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ.. ద్విపాత్రాభినయంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో కంచె బ్యూటీ ప్రగ్య జైస్వాల్ కథానాయిక గా నటిస్తుండగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు టీజర్ లు రాగా ఆ టీజర్ లకు మంచి స్పందన దక్కింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తున్నారు.. నందమూరి అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు..

ఇకపోతే నందమూరి అభిమానులు నిన్న బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏదైనా అప్ డేట్ వదులుతారో అనుకుంటే ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో వారిలో నిరాశ నెలకొంది.. అయితే వారికి బాలకృష్ణ డబల్ డోస్ ఇవ్వనున్నారు.. తన పుట్టిన రోజున ఏకంగా రెండు బంపర్ ఆఫర్ లు ప్రకటించబోతున్నాడట బాలయ్య.. బాలకృష్ణ ఈ చిత్రం తర్వాత చేయబోయే చిత్రంతో పాటు అఖండ కి సంబందించిన మరో బిగ్ అప్ డేట్ ను కూడా జూన్ పదిన ప్రకటించబోతున్నారట బాలయ్య..

ఇది బాలకృష్ణ అభిమానులను ఎంతో ఖుషి చేస్తుండగా బాలకృష్ణ అఖండ తర్వాత ఇటీవలే క్రాక్ సినిమా తో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నాడనే వార్తలు షికార్లు కొడుతుండడం తో ఈ అనౌన్స్ మెంట్ రాబోతుందని అభిమానులు అనుకుంటున్నారు.. ఏదైతేనేం ఇద్దరు మాస్ దర్శకులతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడు బాలయ్య.. ఇప్పటికే వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న బాలకృష్ణ కి ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో హిట్ లు అందిస్తాయి చూడాలి..  అటు బోయపాటి కి ఈ సినిమా కి ముందు చేదు అనుభవం మిగలడంతో ఎంతో కసితో అఖండ రూపొందించారని తెలుస్తుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: