ప్రభాస్ కి ఆమే ప్రత్యేకం..!

Suma Kallamadi
ప్రపంచానికి మనిషిని అమ్మే పరిచయం చేస్తుంటుంది. అంటే, మనిషి ప్రస్థానం అమ్మ నుంచే ప్రారంభమవుతుందన్నమాట. ఆ అమ్మ కోసం ఓ రోజున ఇంకాస్త ప్రత్యేకంగా కేటాయిస్తే అది తప్పేమీ కాదు. అది అమ్మ మీద మన అభిమానాన్ని ఇంకొంచెం ఎక్కువగా చాటుకోవడానికి ఉపయోగపడుతుందని సంబరపడాల్సిందే. అది అమ్మ మీద చూపించే ప్రేమ మాత్రమే కాదు, మనల్ని మనం గౌరవించుకునే వైనమది. అందరికీ వారి వారి అమ్మ ప్రత్యేకం. మొదటి గురువు కూడా. గల్లీ బాయ్ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ అందరూ అమ్మను దైవంలానే చూస్తారు. అలాంటి కోవకు చెందినవారే మన రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాడు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులు అయినా టాలీవుడ్ దర్శకులు అయినా సరే ప్రభాస్ తో సినిమా చేయడానికి పోటీపడుతున్నారు.
ఈ రోజు ప్రభాస్ జీవితం ఇలా ఉందంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి.. ప్రభాస్ పెద్దమ్మే ఉప్పలపాటి శ్యామల. కృష్ణం రాజు భార్య ప్రభాస్ కెరీర్ లో చాలా కీలకంగా ఉంటారని ప్రభాస్ విషయాలను ఆమే స్వయంగా పట్టించుకుని అండగా నిలబడుతూ ఉంటారని మనం ప్రభాస్ ఆడియో ఫంక్షన్లలో, సినిమా ఫంక్షన్లలో వింటూనే ఉంటాం. ప్రభాస్ సినిమాలను ఆమే స్వయంగా ఎంపిక చేస్తుంటారని, ఏ సినిమాలో అయినా ప్రభాస్ సినిమాల మీద ఆమె మార్క్ ఉంటుందని చాలా మంది దర్శకులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమే స్వయంగా చూస్తుంటారు. ఈ విషయంలో కృష్ణం రాజు నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవికావు. ప్రభాస్ కి తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రోత్సాహం కంటే ప్రధానంగా పెద్దమ్మ నుంచి వచ్చిన ప్రోత్సాహమే చాలా కీలకం అని తెలుస్తోంది. ఆమెకు చెప్పకుండా ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో ఏ పని కూడా చేయరు. అందుకే అమ్మకంటే పెద్దమ్మనే ప్రభాస్ ఎక్కువగా అభిమానిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: