ఆకట్టుకుంటున్న కిచ్చా సుదీప్ "కె 3 కోటికొక్కడు" ఫస్ట్ లుక్...

Purushottham Vinay
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి విలక్షణమైన నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక పక్క కన్నడలో పెద్ద స్టార్ హీరోగా కొనసాగుతూ తెలుగులో కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుదీప్. ఇక వరుస సినిమాలతో పెద్ద పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న సుదీప్ తాజాగా నటించిన చిత్రం 'కోటిగోబ్బ 3'."ప్రేమమ్ " ఫేమ్ మడోన్న సెబాస్టియన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కన్నడలో భారీ బడ్జెట్‌లో ఎమ్‌.బి. బాబు నిర్మించారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించగా.. అర్జున్ జన్య సంగీతం అందించారు. ఇప్పటికే కన్నడలో రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సూపర్ హిట్ అవడంతో సినిమాపై భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి.

ఈ చిత్ర తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌, ఓవర్సీస్‌ రైట్స్‌ శ్రేయస్‌ మీడియా అనుసంధానిత సంస్థ గుడ్‌ సినిమా గ్రూప్‌ ఫ్యాన్సీ అమౌంట్‌కు దక్కించుకుంది. అంతే కాదు ఈ చిత్రానికి తెలుగు టైటిల్‌గా 'కె3 కోటికొక్కడు' అని కూడా ఆ సంస్థ ఖరారు చేసింది.ఇక ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు.'కె3 కోటికొక్కడు' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకులు మారుతి, బాబీ, గోపీచంద్ మలినేని సంయుక్తంగా విడుదల చేయడం విశేషం. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ సిగరెట్ వెలిగిస్తూ డాలర్స్ మధ్య నుండి నడుస్తూ ఉన్న ఈ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది. డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఏప్రిల్ 4వ వారంలో ఈ చిత్రాన్ని కన్నడ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో అత్యధిక థియేటర్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.కన్నడలో భారీ అంచనాలున్న 'కోటిగోబ్బ 3' చిత్రాన్ని.. తెలుగులో 'కె3 కోటికొక్కడు' టైటిల్‌తో స్పందన పాసం, శ్వేతన్ రెడ్డి సమర్పణలో దేవేందర్ డీకే మరియు గుడ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: