షాలిని పాండే ఎంత చిక్కిపోయిందో చూడండి.. అస్సలు గుర్తుపట్టలేరు..??

Mamatha Reddy
అర్జున్ రెడ్డి' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.. ఆ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.. ఘాటైన ముద్దు సీన్లలో రెచ్చిపోయి మరీ నటించిన ఈ అమ్మడికి ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారంతా.. కానీ అవేమి జరగలేదు.. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించిన షాలిని.. ఇప్పుడు తెలుగులో కనిపించడమే గగనం అయిపోయింది.. మొన్నామధ్య అనుష్క లీడ్ రోల్ లో నటించిన నిశ్శబ్దం సినిమాలో తళుక్కున మెరిసింది ఈ భామ..ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కనిపించడం తక్కువ అయిపోయింది. 'మహానటి' సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన షాలినీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లో కనిపించింది. అది అలా ఉంటే ప్రస్తుతం షాలినీ హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో ఓ సినిమా చేస్తోంది...

ఇక సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా పాల్గొంటూ తన లేటెస్ట్ పిక్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ భామ.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ హాట్ పిక్ చేసింది.. తన బ్యాక్ చూపిస్తూ.. జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చేసుకొను అంటూ ఓ క్యాప్షన్ పెట్టి మరీ ఆ పిక్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం షాలిని పాండే బ్యాక్ లెస్ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.. ఈ పిక్ చూసిన నెటిజన్లు షాలిని ఈ పోజ్ లో చాలా హాట్ గా ఉందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.. ఇక్కడ మరో విశేషం ఏంటంటే తన గత ఫొటోలలో కాస్త లావుగా కనిపించిన ఈ భామ. ఈ పిక్ లో మాత్రం బాగానే సన్నబడింది..బహుశా ఇది సినిమాలో ఆఫర్స్ కోసం తాను ఇలా జీరో సైజ్ ని ట్రై చేస్తుందేమోఅని అంటున్నారు నెటిజన్లు.. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో రెండు ప్రాజెక్టులు చేస్తోంది.. అంతేకాదు ఈ రెండు సినిమాలపైనే షాలిని పాండే తన ఆశలన్నీ పెట్టుకుంది.. మరి ఆ సినిమాలు హిట్ అయి.. మళ్ళీ షాలినికి అవకాశాలు వస్తాయేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: