"సుశాంత్ ని చంపింది వాడే..తొందర్లోనే వాడి పేరు బయటపెడతా"..సంచలంగా మారిన కంగనా రనౌత్ లేటెస్ట్ ట్వీట్..??

Anilkumar

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కంగనా అంటే ఫైర్‌బ్రాండ్‌ అనే పేరొచ్చింది ఇప్పుడు. మొన్నీ మధ్యే ట్విట్టర్‌ సిఇవోని కడిగి పారేసింది. నన్ను వదిలేయ్ తల్లోయ్‌.. అని సదరు సిఇవో ప్రార్థిస్తేగానీ శాంతించలేదు కంగనా.ఇప్పుడు కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ మీదకి దండెత్తింది. అదీ మాజీ ప్రియుడికి సంబంధించిన వ్యవహారాన్ని ఈసారి ఆధారంగా తీసుకుని కంగనా చెలరేగిపోయింది. తన పరువు ప్రతిష్టని మంటగలపడానికే కొందరు నడుం కట్టారని, అటువంటివారిని వదలిపెట్టే పనే లేదని సోషల్‌ మీడియా ద్వారా స్పష్టం చేసింది. చేస్తూ.. కొందరు పెయిడ్‌ కాంపైన్‌కి బానిసలుగా మారి తన మీద బురద జల్లుతున్నారని, వారెవరో తనకి తెలుసునని కొపంతో రగిలిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయర్స్‌ని 5 లక్షలకి తగ్గించడానికి బాగా డబ్బు ఖర్చుపెట్టారని, అటువంటివారిని తప్పనిసరిగా రచ్చకీడుస్తా అని తీవ్రస్వరంతో హెచ్చరించింది.
 అసభ్యకరమైన మీమ్స్, అన్యాయమైన సమాచారం తనని గురిపెట్టి చాలా ఖర్చుపెట్టి మరీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఏకరువు పెడుతోంది.ఎందుకంటే ఎలాగూ ఫాలోయర్స్ తగ్గిపోయేట్టు ఓ పథకం ప్రకారం వ్యూహం పన్నుతున్నారు కాబట్టి అభిమానుల వల్ల పెద్ద బెడద ఉండదని ధీమాగా ఉన్నారని.. ఫాలోకాని వాళ్ళకు ఎలాగూ తెలియదు కాబట్టి ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నవాళ్ళెవరో తనకి బాగా తెలుసు అని కంగనా ఊదరగొట్టేస్తోందిప్పడు. నా వెనుక ఉన్న టీమేమీ తక్కువది కాదు.. అన్ని విషయాలను ఆరా తీస్తున్నారు. రేపోమాపో అన్నీ వెల్లడవుతాయి.. ఎవరికి ఎవరు ఎంతెంత ఎర వేస్తున్నారు.. ఆ ఫేక్‌ కంపెనీలు ఎక్కడివి, ఎవరివి? ఈ మీమ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి..
 ప్రతీ ఒక్క విషయం బైటకు తెస్తుంది నా టీమ్‌ అంటూనే.. అయితే నాకు తెలియక కాదు ఆ పని ఎవరు చేస్తున్నారో.. కాకపోతే అధికారికంగా బైటపడినప్పడు ఆ విలువ వేరేగా ఉంటుంది కదా.. అని మళ్ళీ సన్నాయి నొక్కు నొక్కింది కంగనా మేడమ్. సరైన టైమ్‌ కోసం ఎదురు చూస్తోందట ఈ సివంగి.అక్కడితో ఆగిపోలేదు కంగనా.. మరో ట్వీట్‌తో అందరికీ షాకిచ్చింది.ఇటువంటి నీచమైన వ్యవహరం ఎవడు నడుపుతున్నాడో నాకు తెలుసు. నాకో పనికిమాలిన ప్రేమికుడున్నాడు. వాడితో నాకు కొన్నాళ్లు సంబంధం ఉంది. సంబంధాలే.. వాడొక్క పిల్లని కూడా పెళ్ళి చేసుకోడు. ఎందుకంటే వాడి బీరువానిండా లెక్కలేనన్ని అస్థిపంజరాలుంటాయి. మనం ఆనందంగా, హాయిగా ఉంటే ఆ మాఫీయా ర్యాకెట్‌ విడిచిపెట్టదు. వాడే సుశాంత్‌ని కూడా ఫినిష్ చేశాడు. త్వరలోనే అన్నీ మీ ముందర పెడతాను..  అంటూ భయపెడుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: