సంతోష్ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' కథని మొదట ఓ స్టార్ హీరోకి వినిపించాడన్న సంగతి మీకు తెలుసా..??

Anilkumar
టాలీవుడ్లో మొదట ఓ సినిమాటోగ్రాఫర్ గా తన కెరీర్ ను స్టార్ చేసిన సంతోష్ శ్రీనివాస్.. కొన్నాళ్లకు తన టాలెంట్ తో దర్శకుడిగా మారాడు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కందిరీగ అనే సినిమాతో తెలుగులో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ కు..ఆ సినిమా పెద్ద విజయాన్ని అందించింది.. దానితో ఈ డైరెక్టర్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి.. తన రెండవ సినిమానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఈ దర్శకుడు.. ఎన్టీఆర్ తో రభస అనే సినిమాను తీసాడు సంతోష్.. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. తర్వాత కొన్నాళ్ళ వరకు మంచి కథను సిద్ధం చేసే పనిలో పడ్డ ఈ దర్శకుడు..
 తాజాగా అల్లుడు అదుర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..  బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా..నభా నటేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాక కమర్షియల్ గాను అట్టర్ ఫ్లాప్ గా నిలిచే దిశగా సాగుతొంది.అయితే.. తొలుత ఈ కథను మన మాస్ రాజా రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తీయడానికి సన్నాహాలు జరిగాయట. ఒక ఆరు నెలలపాటు ప్రీప్రొడక్షన్ వర్క్ జరిగాక రవితేజకు నచ్చకో లేక మైత్రీ సంస్థకు నచ్చకో ప్రాజెక్ట్ ను ఆపేశారట.
తర్వాత తెరి రీమేక్ ను రవితేజ హీరోగా తీయడానికి ప్రయత్నించినప్పటికీ సంతోష్ హ్యాండిల్ చేయలేకపోయాడని వదిలేశారు. దాంతో ఆ కథ బెల్లంకొండ దగ్గరకి రావడం కామెడీ, ఫైట్లు చాలు కథ ఎందుకు అని బాబు పెద్దగా ఏమీ పట్టించుకోకపోవడంతో సినిమా ఆడియన్స్ నెత్తి మీద పడింది.పొరపాటున ఇదే సినిమా రవితేజ చేసి, ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యుంటే ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలవడమే కాక, కెరీర్ కి ఒక మాయని మచ్చలా మిగిలిపోయేది..మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కి ఈసారి కూడా ఒక కమర్షియల్ హిట్ పడలేదనే చెప్పాలి...!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: