నేను హీరో అయ్యాక స్టార్ హీరోలు చాలా మారిపోయారు - బెల్లంకొండ..?

P.Nishanth Kumar
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా టాలీవుడ్ స్టార్స్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్లుడు అదుర్స్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు ఈ సంక్రాంతికి రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా రిలీజ్ ముంగిట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద సంచలనం గా మారింది. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో నభ నటేష్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చింది..
అయితే రిలీజ్ విషయంలో కొంత గందరగోళం నెలకొంది.. రిలీజ్ డేట్ విషయంలో అదే రోజున విడుదల అవుతున్న మరో సినిమా తో క్లాష్ ఏర్పడింది.. అయితే అది ఇప్పుడు సద్దుమనగగా సంక్రాంతి రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. ఈ నేపథ్యంలో తను హీరో కాకముందు అందరు స్టార్స్ ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండేవారని ఇప్పుడు అలా లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రమోసన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల టాలీవుడ్ స్టార్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీకి రాక ముందు తనకు ఒక అభిప్రాయం ఉందని అది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మారిందని పేర్కొన్నాడు.
తాను హీరోగా పరిచయం అవ్వక ముందు ఇండస్ట్రీలో ఉన్న వారు అంతా కూడా ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటారని భావించాను. కాని ఇక్కడకు వచ్చిన తర్వాత అంతా ఒక ఫ్యామిలీ కాదనిపించింది. కాని ఇప్పుడు అనీల్ రావిపూడి గారు మా సినిమా ఫంక్షన్ కు రావడం మా సినిమా కోసం ఆయన సహకారం అందించడం జరిగింది. దాంతో నేను అనుకున్నది తప్పు అని ఇండస్ట్రీ స్టార్స్ అంతా కూడా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఒక ఫ్యామిలీలా కలిసి పోతారు అనిపిస్తుందని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: