బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్ లో ఏవిధంగా వీక్షణలు పొందుతుందో మనకి తెలుసు .. గత ఏడాది సంక్రాంతి లో విడుదలైన ఆలా వైకుంఠపురములో సినిమా సెన్సేషన్ హిట్ గా నిలిచింది .. ఆ సినిమాలోని అన్ని పాటలు దాదాపుగా హిట్ టాక్ తెచ్చుకున్నాయి .. 2020 లో వచ్చిన బెస్ట్ పాటలలో బుట్టబొమ్మ మొదటి ప్లేస్ లో ఉంటుంది .. ఇక బుట్టబొమ్మ సాంగ్ అల్లు అర్జున్ తో పాటు పలువురు అభిమానులు కూడా కాలు కదిపారు పాటకి స్టెప్పులు వేశారు .. ఆలా ఆ పాటకి స్టెప్పులు వేసిన వారిలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారు .. కరోనా సమయం లో పలు పాటల పై డాన్స్ స్టెప్పులు వేసిన వార్నర్ తన భార్య తో కలిసి బుట్టబొమ్మ పాటపై కూడా స్టెప్పులు వేసి అభిమానులను ఆకట్టుకున్నారు .. ఇక బుట్టబొమ్మ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవడం వెనుక డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారంటూ ఆసక్తికరమైన మాట చెప్పారు అల్లు అర్జున్ .. ఇక బుట్ట బొమ్మ పాటకు సగం క్రెడిట్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి ఇచ్చేశారు అల్లు అర్జున్. డేవిడ్ వార్నర్ కూడా బుట్టబొమ్మ స్టెప్పులు వేయడంతో ఈ సాంగ్ ప్రపంచమంతా తెలిసింది .. వాళ్ళు కూడా పాటని చూసేలా చేసింది .. తాజాగా సామ్ జామ్ కార్యక్రమంలో పాల్గొన్న అల్లుఅర్జున్ బుట్ట బొమ్మ పాటపై ఆసక్తికరంగా స్పందించారు.
సమంత వ్యాఖ్యాతగా చేస్తున్న సామ్ జామ్ షోలో అల్లు అర్జున్ సినిమా విషయాలను ఎన్నో పంచుకున్నారు. అలాగే యూట్యూబ్ ట్రెండ్ సెట్టర్ బుట్టబొమ్మ పాట విజయవంతం కావడం వెనుక ఆలా వైకుంఠపురములో చిత్ర యూనిట్ ఎంతగా కష్టపడ్డామో మాకు తెలుసు కాబట్టి ఈ గెలుపు లో మాకు ఎంత క్రెడిట్ ఉందో మా పాటని ప్రపంచం చూసేలా చేసిన వార్నర్ కి కూడా అంతే క్రెడిట్ దక్కుతుందని ఈ షో ద్వారా అల్లు అర్జున్ తెలియజేసాడు .. ఇటీవల ఇండియా తో టెస్ట్ సిరీస్ జరుగుతుండగా స్టేడియంలో కూడా వార్నర్ ఆ పాటకి కూడా డాన్స్ చేయడం నిజంగా తనని ఆశ్చర్య పరిచిందని అన్నాడు .. ఇక ఆలా వైకుంఠపురములో చిత్రానికి తమన్నా అందించిన బాణీలు ఒక రేంజ్ లో పేరు తెచ్చుకున్నాయి ..
మరింత సమాచారం తెలుసుకోండి: