"ఓటీటీ కంటే థియేటరే బెస్టు..." - రామ్ పోతినేని

Naga Sai Ramya
"ఇస్మార్ట్ శంకర్" తో మాసివ్ హిట్ కొట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సంక్రాంతి నాడు "రెడ్" మూవీతో థియేటర్స్ లో ఫెస్టివ్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. స్రవంతి రవికిశోర్ ఈ సినిమాను శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. నివేతా పేతురేజ్, అమృతా అయ్యర్ ఆలాగే మాళవిక శర్మ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్స్ గా కనిపించబోతున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.
"రెడ్" ట్రైలర్ విడుదలై ట్రెండింగ్ లో ఉంది. ట్రైలర్ విడుదలైన ఒక్క రోజులోనే మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుంది. రెడ్ ట్రైలర్ లాంచ్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ " రామ్ పోతినేని చాకొలేట్ బాయ్ ఇమేజ్ ను మాస్ హీరో ఇమేజ్ గా మార్చుకునేందుకు "ఇస్మార్ శంకర్" బాగా హెల్ప్ చేసిందని ఇప్పుడు "రెడ్" తో డబుల్ థమాకా కొట్టబోతున్నాడని ప్రశంసించాడు. రామ్ డబుల్ యాక్షన్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతుందని ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాడు దిల్ రాజు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఓటీటీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. "మన ఇంట్లో పూజ గది ఉన్నా మనం గుడికి వెళ్లి దర్శనం చేసుకునేందుకు మొగ్గు చూపుతాము. అదే విధంగా ఎన్ని ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ ఉన్నా వాటిని థియేటర్ తో అస్సలు కంపేర్ చేయలేము. మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ను దేంతోను పోల్చలేము. బిగ్ స్క్రీన్ లో సినిమాను చూడడం ఒక వరమని చెప్పుకోవచ్చు. స్రవంతి రవికిశోర్ గారు ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయడానికే పట్టుబట్టారు." అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే, డైరెక్టర్ తిరుమల కిషోర్ తో పాటు సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి పనితనాన్ని మెచ్చుకున్నాడు రామ్. వీరిద్దరి వల్ల ఈ సినిమాలో విజ్యువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని చెప్పాడు. ఈ సినిమాలో నివేతా పోషించిన లేడీ కాప్ రోల్ మరింత ఇంటరెస్టింగ్ గా ఉండబోతోందని హింట్ ఇచ్చాడు. అదే సమయంలో అమృతా అయ్యర్ అలాగే మాళవిక శర్మల టాలెంట్ ను కూడా రామ్ ప్రశంసించాడు.
ఏది ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటే సేఫ్టీ సేఫ్టీనే అంటూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని థియేటర్లో అడుగుపెట్టమని ఆడియెన్స్ కు రామ్ సూచించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: