మెగా మూవీలో కియరా అద్వాని..!

shami
బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సూపర్ ఫాంలో ఉంది కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ తర్వాత క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అమ్మడు సత్తా చాటుతుంది. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ సినిమాతో హిట్ అందుకుని రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది.
తెలుగులో ఇద్దరు స్టార్స్ పక్కన నటించిన ఈ అమ్మడు ఇక్కడ అవకాశాలు వస్తున్నా సరే బాలీవుడ్ లో బిజీ అవడం వల్ల ఇక్కడ చేయడం కుదరట్లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమాలో మాత్రం అమ్మడికి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వానిని సెలెక్ట్ చేశారట.
బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా సరే మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా అవడం వల్ల కియరా ఈ ఆఫర్ ను కాదనలేని పరిస్థితి. తెలుగులో అమ్మడికి ఇది మరో క్రేజీ మూవీ అని చెప్పొచ్చు. కేవలం సినిమాలే కాదు ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు కుర్రాళ్ళను డిస్ట్రబ్ చేస్తుంది. మెగా మూవీతో మరోసారి తెలుగుతెర మీద అమ్మడు దుమ్ముదులిపేస్తుందని చెప్పొచ్చు. తెలుగు, హిందీ భషల్లో కియరా అద్వాని ఫాం చూసి మిగతా హీరోయిన్స్ అసూయపడుతున్నారు.                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: