బిగ్ బాస్ లో నేను లేను.. షాక్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ..!

shami

తెలుగులో పెద్దగా అవకాశాలు లేక బాలీవుడ్ చెక్కేసిన శ్రద్ధా దాస్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టంట్ గా వస్తుందని కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి. శ్రద్ధా దాస్ తో పాటుగా మరికొంతమంది హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. త్వరలో మొదలవనున్న బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో తాను కంటెస్టంట్ గా వస్తున్న వార్తలపై సీరియస్ అయ్యింది శ్రద్ధా దాస్. తను బిగ్ బాస్ లో పాల్గొనడం లేదని ఈ వార్తలని స్ప్రెడ్ చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటుంది అమ్మడు.  

 

సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ హాట్ ఫిగర్ తన సొంతమైనా అందుకు తగిన అవకాశాలను మాత్రం అందుకోవడంలో విఫలమైంది. అయితే స్టార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరియర్ సాగిస్తున్న అమ్మడు ఒకటి రెండు ఐటం సాంగ్స్ లో కూడా మెప్పించింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో శ్రద్ధా దాస్ స్టార్ కంటెస్టంట్ గా రాబోతుందన్న వార్తలు హల్ చల్ చేశాయి. కాని ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలుస్తుంది. 

 

తెలుగు బిగ్ బాస్ షోలో నేను పాల్గొనడం లేదు అంటూ బిగ్ బాస్ సీజన్ 4 రూమర్స్ కు చెక్ పెట్టింది శ్రద్ధా దాస్. తెలుగులో ఎలాగు పెద్దగా వర్క్ అవుట్ అయ్యేలా లేదని బాలీవుడ్ చెక్కేసిన అమ్మడు అక్కడ కూడా అరకొర అవకాశాలనే అందుకుంటుంది. అక్కడే కాదు కన్నడ, బెంగాలి సినిమాల్లో కూడా శ్రద్ధా దాస్ సినిమాలు చేస్తుంది. శ్రద్ధా దాస్ బిగ్ బాస్ లో ఉంటే ఈ సీజన్ కూడా సూపర్ హిట్టే అనుకున్న ఆమె ఫ్యాన్స్ కు ఇదో రకంగా చేదు వార్తే అని చెప్పొచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: