షాకింగ్ ఖాళీ అవుతున్న ఫిలింనగర్ కృష్ణానగర్ అందోళనలో ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja

షూటింగ్ లు మొదలుపెట్టడానికి ప్రభుత్వఅనుమతులు గతనెలలో వచ్చిన వెంటనే పెద్దహీరోల సినిమాలు ఎలా ఉన్నా చాలామంది మీడియం రేంజ్ చిన్న సినిమాల దర్శక నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ వర్క్ ను వెంటనే మొదలుపెట్టాలి అన్నఆలోచనలు చేసారు. అయితే అనూహ్య స్థాయిలో తెలుగు రాష్ట్రాలలో కరోనా సమస్య రోజురోజుకి పెరిగిపోతు ఉండటంతో పాటు పరిస్థితులు అదుపు తప్పడంతో షూటింగ్ స్పాట్ కు రావడానికి చిన్నస్థాయి హీరోలు కూడ భయపడిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.


దీనితో కనీసం సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతాలకు అయినా షూటింగ్ లు మొదలవుతాయి అన్నభావనతో ఇప్పటివరకు ఉన్నారు. ఇప్పుడు కరోనా కేసుల పరిస్థితి మరింత పెరిగిపోతు హైదరాబాద్ అంతా అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో తమ సినిమాలకు సంబంధించి కేవలం 15రోజులు 20రోజులు పెండింగ్ షూటింగ్ ఉన్న నిర్మాతలు కూడ ప్రస్తుత పరిస్థితులలో చేతులు ఎత్తేసి తమ సినిమాల షూటింగ్ లను నిరవదికంగా వాయిదా వేసారు.


ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో చిన్నసినిమాలు మొదలుకుని పెద్దసినిమాల వరకు ఈసంవత్సరం డిసెంబర్ వరకు షూటింగ్ లు ప్రారంభం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో ప్రముఖ నిర్మాణ సంస్థల దగ్గర నుండి చిన్ననిర్మాణ సంస్థల వరకు తమ ప్రొడక్షన్ ఆఫీసులను మూసివేసి తమ దగ్గర పనిచేసే సిబ్బంది అందర్ని మరో నాలుగు నెలల తరువాత కనిపించమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.


దీనితో ఇండస్ట్రీలో చేయడానికి పనులు లేక చేతిలో రూపాయి లేకపోవడంతో కృష్ణానగర్ ఫిలింనగర్ ప్రాంతాలలో చుట్టుపక్కల నివసించే అనేకమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ చిన్నచిన్న టెక్నిషియన్స్ నటీనటులు తమ ఇళ్ళు ఖాళీ చేసి గతంలో వలస కార్మీకులు హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోయినట్లుగా వీరంతా కృష్ణానగర్ ను ఖాళీ చేసి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం భాగ్యనగరం నుండి సుమారు 30 లక్షల మంది చిన్నచిన్న పనులు వృత్తులు చేసుకునే వారు తమ ఊళ్లకు వెళ్లిపోయినట్లుగా ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్స్ చిన్నాచితకా టెక్నిషియన్స్ అంతా ఫిలింనగర్ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితులలో తిరిగి వారంతా హైదరాబాద్ కు వచ్చే దాకా హీరోలు సాహసం చేసినా దర్శకులు ముందుకు వచ్చినా సినిమాలు తీయలేని పరిస్థితి అంటూ ఇక ఈసంవత్సరం ఏమి లేనట్లే అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: