పోలీస్ ఆఫీస‌ర్‌గా కళ్యాణ్ రామ్ దుమ్ము దులిపేశాడుగా..!!

Kavya Nekkanti

పోలీస్ ఆఫీస‌ర్‌గా కళ్యాణ్ రామ్ న‌టించిన చిత్రం `ప‌టాస్‌`. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రం ద్వారానే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతి సోది హీరోయిన్‌గా న‌టించింది. ఎప్పుడూ విభిన్న కధాంశాలు, స్క్రీన్ ప్లే లు అంటూ వెళ్లిన‌ కళ్యాణ్ రామ్ కు అవేమీ కలిసి రాలేదు. కానీ, రొటీన్ కథే అయినా కొత్త కామెడీ సీన్స్ తో కథనం పరుగెత్తించి` పటాస్` చిత్రంతో భారీ హిట్ అందుకున్నాడు. 

ఒక పూర్తి మాస్ పోలీసాఫీసర్‌గా కల్యాణరామ్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాడు. బహుశా కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. మరియు ఈ పాత్ర‌లో ఆయ‌న నటించిన తీరు అదిరిపోయింద‌ని చెప్పాలి. ఒక పోలీస్ ఆఫీస‌ర్‌గా  క‌ళ్యాన్ రామ్ సినిమా అంతా చాలా ఎనర్జిటిక్ గా నటించాడు‌. ఇక కళ్యాణ్‌రామ్‌ ఇందులో తన సహజ శైలికి భిన్నంగా కామెడీ చేయడానికి చూసాడు కానీ, విలన్‌ని ఢీకొట్టే సీన్స్‌లో చాలా కంఫర్టబుల్‌గా అనిపించాడు. 

హీరోయిజమ్‌పై బేస్‌ అయిన కథ అయినా కానీ తన వరకు ఎక్కడా తడబడకుండా పాత్రకి అనుగుణంగా నటించి బాగా స్కోర్‌ చేసాడు. మ‌రియు కొన్ని సీన్స్‌లో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌ళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయ‌ని చెప్పాలి. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. మాస్ మసాలా పోలీస్ గా కళ్యాణ్ రామ్ దుమ్ము దులిపేశాడు. ఇక అనిల్ రావిపూడికి ఇది మొద‌టి సినిమానే అయినా.. తనకున్న కలం బలంతో డైలాగులు పేల్చి స్క్రీన్ పై చెడుగుడు ఆడేసాడు. సినిమా మొత్తం ఎక్కడా గ్రాఫ్ క్రిందకి పడకుండా పట్టుకుని కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చాడు. ఓవరాల్ గా, కళ్యాణ్ రామ్ కెరీర్లో ‘పటాస్’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: