ఓరి దేవుడా... పుట్టినరోజు సమయంలో కూడా ఆ కోతి వేషాలు ఆపవా తల్లి....!!

GVK Writings

టాలీవుడ్ కి ముందుగా యువ నటుడు నాగశౌర్య హీరోగా యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది రష్మిక మందన్న. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ కొట్టడంతో పాటు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన ఆకట్టుకునే అందం, అభినయంతో మంచి పేరుని, స్థానాన్ని దక్కించుకుంది రష్మిక. వాస్తవానికి కన్నడకు చెందిన ఈ భామ, మొదట్లో కిరిక్ పార్టీ అనే కన్నడ మూవీ ద్వారా సినిమా రంగానికి పరిచయం అయింది. ఇక తెలుగులో ఫస్ట్ సినిమా ఛలో తరువాత నాని సరసన దేవదాస్ లో నటించిన రష్మిక, ఆ తరువాత యువ సంచలన హీరో విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందంలో నటించి మరొక అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 

 

ఇక మొన్నటి సంక్రాంతి సమయంలో రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన సరిలేరు నీకెవ్వరులో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ ప్రక్కనే ఛాన్స్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ, ఇటీవల యంగ్ హీరో నితిన్ తో కలిసి బీష్మ లో నటించి ఇంకొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం బన్నీ, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక, నేడు తన 23వ పుట్టినరోజుని జరుపుకుంటోంది. వాస్తవానికి ఎప్పుడూ షూటింగ్స్ లో ఎంతో చలాకీగా ఉండే రష్మిక, ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటుంది. 

 

అలానే తాను పెట్టె పోస్టులకు ఎక్కువగా కోతి బొమ్మతో కూడిన ఎమోజీలను సరదాగా పోస్ట్ చేసే అలవాటున్న రష్మిక, నిన్న రాత్రి తన బర్త్ డే కామన్ డిస్ప్లే  పిక్చర్ (సిడిపి) ని రిలీజ్ చేసిన దర్శకుడు వెంకీ కుడుములకు థాంక్స్ చెపుతూ మరొక్కసారి తన ట్విట్టర్ లో కోతి బొమ్మ ఉన్న ఎమోజి పోస్ట్ చేయడంతో, ఎప్పుడూ కోతులతో పోస్టులు పెట్టె నువ్వు, కనీసం పుట్టినరోజు సమయంలో కూడా వాటిని వదలవా తల్లి, నువ్వు నీ కోతి వేషాలు అంటూ కొందరు నెటిజన్లు సరదాగా ఆ పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: