కార్తీక దీపం వంటలక్క దెబ్బకు బెల్లంకొండ విల‌విల‌..

Kavya Nekkanti

రాత్రి ఏడున్నర అయిందంటే చాలు తెలుగింట దాదాపు ప్రతి ఇంటిలోనూ కార్తీకదీపం సీరియ‌ల్‌ మొదలవ్వల్సిందే. కార్తీకదీపం సీరియల్ లోని దీప అలియాస్ వంటలక్క అంటే ఇష్టపడని మహిళా ప్రేక్షకులు దాదాపు ఉండరు. సీరియల్ లో తన నటనతో కన్నీళ్లు పెట్టించే దీపకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఉన్న దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్. ఈ సీరియల్ మలయాళంలో ప్రసారం అవుతున్న కరుతముతూ సీరియల్ ఆధారంగా నిర్మించబడింది. అయితే కార్తీకదీపం సీరియల్ దెబ్బకు బుల్లితెరపై రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. 

 

తెలుగులో టీవీ ప్రోగ్రామ్స్ కు సంబంధించిన తాజా రేటింగ్స్‌లో ఈ వారం కూడా కార్తీక దీపమే టాప్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో వదినమ్మ నిలిచింది. బార్క్ ఇండియా విడుదల చేసిన ఈ రేటింగ్స్‌లో వరుసగా కార్తీక దీపం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక ఆ సీరియల్ ఆత్మాభిమానం ఉన్న ఆడపడుచుగా అందరి ప్రశంసలూ అందుకుంటోంది దీప. వంటలక్కగా ఈ నటీమణి ప్రేమీ విశ్వనాథ్ నటనకు అందరూ నీరాజనాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే కార్తీక దీపం ఆదరణతో అటు స్టార్ మా చానెల్ అయితే తన మాతృసంస్థ అయిన స్టార్ ప్లస్ ను సైతం రేటింగ్స్‌లో దాటేసింది. 

 

స్టార్‌మా టాప్‌లో నిలిచేందుకు వంటలక్క ఆదరణే కారణమని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నారు. అంతేకాందండోయ్‌.. అదే వారం జెమిని టీవీలో ప్రసారం అయిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్ష‌సుడు సినిమా సైతం రిలీజైంది. అయినా కూడా కార్తీక దీపం వెలుగు ముందు వెలవెల పోయింది. దీనిని బ‌ట్టీ చూస్తుంటే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాలు ప్ర‌సార‌మ‌వుతున్న ప్రేక్ష‌కులు మాత్రం కార్తీక‌దీపం సీరియ‌ల్‌కే ప‌రిమితం అవుతున్నారు. ఎన్ని పనులున్నా సరే ఆ సమయానికి మహిళా మణులు వారికి తోడుగా ఇంటిల్లపాదినీ టీవీల ముందు కట్టిపాడేస్తోంది కార్తీకదీపం సీరియల్.

 
 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: