అమ్మ రుణం నిజంగా తీర్చుకున్న కొడుకీ తారక్....!!

Mari Sithara

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటరత్న శ్రీ ఎన్టీఆర్ గారి మనవడైన జూనియర్ నందమూరి తారక రామారావు, బాలనటుడిగా తొలుత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బలరామాయణం అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేయడం జరిగింది. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ ఆశీస్సులతో ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా అప్పట్లో బాలనటుడిగా ఆయనకు బాగానే పేరు తీసుకువచ్చింది. ఇక కొన్నాళ్ళకు పెరిగి పెద్దయిన తరువాత ఉష కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా తెరకెక్కిన నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, 

 

ఫస్ట్ మూవీ తో మంచి సక్సెస్ నే అందుకున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్, ఆయనకు కమర్షియల్ గా మంచి సక్సెస్ ని అందించింది. ఇక ఆ తరువాత నుండి మెల్లగా వస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగిన తారక్, అనతికాలంలోనే తిరుగులేని మాస్ ఇమేజిని మరియు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుడిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. మొదటి నుండి తన తల్లి షాలిని, తండ్రి హరికృష్ణ గారు, తనకు అన్ని విధాలా సహకరించేవారని, తాతగారి దీవెనలతో పాటు వారి ప్రోత్సాహం వల్లనే తాను ఇంత ఉన్నత స్థానంలో ఉన్నానని తారక్ ఎప్పుడూ చెప్తుంటారు. 

 

మొదటి నుండి ఆయన తల్లిని నందమూరి ఫ్యామిలీ వారు కొంత దూరం పెట్టడంతో, ఎప్పటికైనా తన తల్లి గర్వించే స్థాయికి ఎదగాలని ఎంతో కృషిచేసిన తారక్, నేడు ఇంతటి గొప్ప స్థాయికి ఎదగడం, కేవలం ఆమెకు మాత్రమే కాదు మొత్తం నందమూరి వంశానికే పెద్ద గర్వకారణం అని చెప్పాలి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరుగా కొనసాగుతున్న ఎన్టీఆర్, ప్రస్తుతం మరొక నటుడు రామ్ చరణ్ తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ లో హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమా కనుక మంచి హిట్ సాధిస్తే తారక్ రేంజ్ జాతీయ స్థాయికి పెరగడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: