ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
దసరా సెలవులు అయిపోయిన గాని సక్సెస్ ఫుల్ గా సైరా సినిమా హాల్స్ హౌస్ ఫుల్ బోర్డు లతో దర్శనమిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తెలుగువాడిగా దేశం కోసం పోరాడిన ఉయ్యాలవాడ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బడా బడా రాజకీయ నేతలను కలిసి సినిమా చూడాలని పేర్కొన్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో తాజాగా చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ను కలిసి సినిమా గురించి ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సైరా సినిమా యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
దేశ భక్తిని పెంపొందించే సినిమాలు చాల తగ్గిపోయాయని సై రా నరసింహారెడ్డి ఆ కొరతని తీర్చేసింది అని చిరంజీవిని కొనియాడారు. వెంకయ్య నాయుడు తన నివాసం లో చిరంజీవి, కుటుంబ సభ్యులు, కామినేని శ్రీనివాస్ తో సై రా ని చూసినట్లు తెలుస్తుంది. సినిమాలో బ్రిటిష్ పాలకులు భారతీయుల పై చేసిన దౌర్జన్యాలను, పాలనా విధానాన్ని, స్వార్థాన్ని, అంతర్గత కలహాల్ని చక్కగా చూపించారని అన్నారు. నిర్మించినందుకు రామ్ చరణ్ ని, దర్శకత్వం వహించినందుకు సురేందర్ రెడ్డి ని ప్రశంసలతో ముంచెత్తారు వెంకయ్య నాయుడు.