సురేందర్ రెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు

Rakesh Singu
 మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్  సైరా నరసింహారెడ్డి  ప్రపంచ వ్యాప్తంగా బుధవారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సైరా సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల  గ్రాస్ కలెక్ట్ చేసింది.  సైరా   విడుదలైన అన్ని చోట్ల నుండి మంచి టాక్ వస్తుంది. ఇండస్ట్రీలోని ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా  సైరా టీమ్ కు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ నటన అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సైరా లో  తమన్నా పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో సైరా యూనిట్ థాంక్యూ మీట్ ని ఏర్పాటు చేసింది.
.
 దిల్ రాజు మాట్లాడుతూ దర్శకుడు సురేందర్ రెడ్డి నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. నేను దిల్ సినిమా తీసేటప్పుడు కథ చెబుతాను అని వెంటపడే వాడు. చాలా సార్లు కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు.  సడన్ గా ఒక రోజు వచ్చి మెగాస్టార్ 151 సినిమా సైరా కు దర్శకత్వం వహిస్తున్నానని చెప్పాడు, కొంచెం కంగారు పడ్డాను . సురేందర్ రెడ్డి ఇంతకు ముందు దర్శకత్వం వహించిన సినిమాలు యాక్షన్ ఎంటర్టైనర్స్ కానీ  సైరా ఒక హిస్టరీకల్ సినిమా. ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నాను కానీ చాలా బాగా తెరకెక్కించాడు.నాకు సినిమా లో మూడు చోట్ల కన్నీళ్లు వచ్చాయి. సురేందర్ రెడ్డి లో ఎమోషనల్ సైడ్ కూడా ఉందని అర్థం అయ్యింది.  సైరా నరసింహారెడ్డి తెలుగు వారి గౌరవం పెంచే సినిమా అని అన్నాడు.


తమన్నా మాట్లాడుతూ  ఈ సినిమా లో చిరంజీవి గారి తో పని చేయడం చాలా ఆనందంగా మరియు గౌరవం గా ఉంది.నా పాత్రకు మంచి ఆదారణ వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేందర్ రెడ్డి, చరణ్ లకు థ్యాంక్స్ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో జగపతి బాబు, చరణ్ , చిరంజీవి,సురేందర్ రెడ్డి మరియు పరుచూరి బ్రదర్స్ పాల్గోన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: