తుఫాన్ : రివ్యూ

Star cast: Ram Charan, Priyanka Chopra, Srihari
Producer: Mahi's Entertainment, Director: Apoorva Lakhia

Toofan - English Full Review

తుఫాన్ రివ్యూ: చిత్రకథ 
ఏసిపి విజయ్ ఖన్నా నిజాయితీ గల అధికారి, దేనికీ భయపడని ఈ అధికారికి బదిలీలు బహుమతిగా లభిస్తుంటుంది. హైదరాబాద్ నుండి ముంబై బదిలీ అయిన విజయ్ కి అక్కడ డిప్యూటి కలెక్టర్ హత్యకి సంభందించిన కేసు డీల్ చెయ్యవలసి వస్తుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా మాయ(ప్రియాంక చోప్రా) విజయ్ జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ కేసు వెనుక ఆయిల్ మాఫియా డాన్ రుద్ర ప్రతాప్ తేజ(ప్రకాష్ రాజ్) పాత్ర ఉందని తెలుసుకున్న విజయ్ ఆ దిశగా తన పరిశోధన మొదలు పెడతాడు. ఇది నచ్చని తేజ విజయ్ ని మట్టు పెట్టించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదే తరుణంలో విజయ్ తేజ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తా అని శపధం చేస్తాడు. ఈ ప్రక్రియలో అతనికి జయదేవ్ (తనికెళ్ళ భరణి) మరియు షేర్ ఖాన్ (శ్రీ హరి) పరిచయం అవుతారు అసలు విజయ్ తేజ సామ్రాజ్యాన్ని ఎలా నేల కూల్చాడు? అని తెలుసుకోవాలనుకుంటే మీరు తెర మీద ఈ సినిమా చూడాల్సిందే..

తుఫాన్ రివ్యూ: నటీనటుల ప్రతిభ
అమితాబ్ బచ్చన్ నటించిన ఈ పాత్రలో మరొకరిని చూడాలంటే కష్టం అయినా కూడా చరణ్ తన వంతు కృషి చేశాడు. ఇలాంటి పాత్ర చెయ్యడం మొదటి సారి అవ్వడం వల్ల కాబోలు కొన్ని సన్నివేశాలలో మరీ తేలిపోయాడు. బాలీవుడ్ ప్రేక్షకుల కోసమే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ని పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఆ విషయంలో ఫుల్ మార్క్స్ కొట్టేసింది ఇంకా చెయ్యడానికి పెద్దగా ఏం లేకపోవడంతో తను కూడా ఏం చెయ్యలేదు. శ్రీ హరి తనకు ఇచ్చిన పాత్రలో పరవాలేదనిపించాడు . ప్రకాష్ రాజ్ చాలా చిత్రాల్లో చేసినట్టుగానే ఈ చిత్రంలో కూడా డాన్ పాత్రలో చేసాడు, నటన కూడా అలానే ఉంటుంది. తనికెళ్ళ భరణి ఉన్నంతలో బాగా చేశారు . మహి గిల్ అందాలు ముందు బెంచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తుఫాన్ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

అపూర్వ లఖియా రెండు సంవత్సరాలకి ఓ సినిమా తీస్తాను, కాస్త హాలీవుడ్ స్టైల్లో తీస్తాను అని చెప్పుకున్నా ఇలా ఎన్ని చెప్పినా అవన్నీ మాటల వరకే పరిమితం అయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా రన్ టైం తగ్గించుకుంటే సినిమా కాస్త వేగంగా అయిపోయినట్టు అనిపిస్తుందని దాంతో ఆడియన్ ని బుట్టలో పడేయొచ్చు అని అనుకున్న అపూర్వ రన్ టైం విషయంలో సక్సెస్ అయినప్పటికీ సినిమా టేకింగ్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే రన్ టైం తక్కువే అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల మధ్య మధ్యలో బోర్ కొడుతుంది. మొత్తంగా ఆడియన్స్ చేత జస్ట్ ఓకే అనిపించుకునే మూవీని తీసాడు. బడ్జెట్ బాగానే పెట్టిన అపూర్వ టెక్నీషియన్స్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ మూవీస్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. వినడానికి డాం డూం అని ఉన్నా సినిమా సీన్స్ కి తగిన రేంజ్ లో రీ రికార్డింగ్ లేదు. పాటలు కూడా పెద్ద చెప్పుకునే స్థాయిలో లేవు. గురురాజ సినిమాటోగ్రఫీ పరవాలేధనిపించినా పెద్ద చెప్పుకునే స్థాయిలో ఏం లేదు. ఎడిటర్ సినిమా వేగంగా వేలుతోందన్న మాటే గానీ ఏదో ఫీల్ మిస్ అవ్తోంది అనే విషయాన్ని తెలుసు కోలేకపోయాడు. తెలుగులో డైలాగ్స్ కూడా ఏదో ఉన్నాయంటే ఉన్నాయి. స్టంట్స్ బాగున్నాయి.


తుఫాన్ రివ్యూ: హైలెట్స్
  • రామ్ చరణ్ యాంగ్రీ యంగ్ మాన్ పెర్ఫార్మన్స్
  • ప్రియాంక చోప్రా, మహీ గిల్ గ్లామర్

తుఫాన్ రివ్యూ: డ్రా బాక్స్
  • స్టొరీ అండ్ స్క్రీన్ ప్లే
  • నో ఎంటర్ టైన్మెంట్
  • సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే పెద్దగా అనిపించకపోవడం

తుఫాన్ రివ్యూ: విశ్లేషణ
చరణ్ బాలీవుడ్ లో ప్రవేశించడానికి అమితాబ్ బచ్చన్ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలనుకోవడం సురక్షితమయిన మార్గమే కాని అమితాబ్ కి యాంగ్రీ మాన్ అని పేరు తెచ్చి పెట్టిన చిత్రాన్ని ఎంచుకోవడం ఎంతవరకు సఫలం అవుతుందని అనుకున్నారో దర్శకుడికే తెలియాలి. బాలీవుడ్ లో ఇది చరణ్ కి తొలి చిత్రం అయ్యుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది కాని ఇది అంతకన్నా ముందు జంజీర్ చిత్రానికి రీమేక్ కాబట్టి అందరు దానితో పోల్చి చూడటం సాధారణం ఆ చిత్రంలో ఒక్కో విభాగంతో పోల్చినా అన్ని కలిపి పోల్చినా సగం కూడా సరితూగే అవకాశం లేదు ఈ చిత్రానికి. చరణ్ మరియు ప్రియాంక మధ్య కెమిస్ట్రీ అసలు బాగోలేదు , శ్రీ హరి మరియు చరణ్ పాత్రల మధ్య సంభంధాన్ని సరిగ్గా చూపించలేదు. సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్ కాబట్టి ప్రియాంక చోప్రా హీరోని కలిసినట్టు. పాత సినిమాలో ఉంది కాబట్టి షేర్ ఖాన్ హీరోకి సహాయం చేసినట్టు అనిపిస్తుంది. రీమేక్ కావడంతో కథ ముందే తెలిసిపోవడం సాధారణం కాబట్టి చెయ్యాల్సిన మేజిక్ ఏదయినా ఉంటె కథనంలో చెయ్యాలి, అసలు ఈ పాయింట్ పరిగణలోకి కూడా తీసుకునట్టు కనిపించదు తరువాత సన్నివేశాలు ఇట్టె తెలిసిపోతుండటంతో ప్రేక్షకుడికి ఉన్న ఆసక్తి కూడా పోతుంది. అపూర్వ లఖియ మాతృకను అయితే పాడు చెయ్యలేదు కాని ఈ చిత్రాన్ని ఆ స్థాయికి తెరకేక్కించలేకపోయాడు. నిజానికి అందులో పది శాతం కూడా చేరుకోలేకపోయాడు, కామెడీ అయినా ఉండి ఉంటె నవ్వే అవకాశం ఉండేది, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఏడుపయినా వచ్చేది కాని చిత్రం ఆసాంతం చరణ్ ని యాంగ్రీ గ చూపించాలన్న ప్రయత్నం ప్రేక్షకులను యాంగ్రీ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రం చరణ్ బాలీవుడ్ కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ప్రశ్నార్ధకం , ఒకవేళ చరణ్ కి ఈ చిత్రం ఉపయోగపడినా ఒక చిత్రంగా మాత్రం ఇది "ఫెయిల్". సమైఖ్యాంద్ర గొడవల మధ్యలో వస్తున్న చిత్రం ఎంతవరకు వాటిని ఎదుర్కుంటుంది అన్న విషయం పక్కన పెడితే చాలా రోజుల తరువాత వస్తున్న పెద్ద హీరో చిత్రం కావడంతో ఓపెనింగ్స్ భారీగా దక్కించుకోనుంది. హిందీ డబ్బింగ్ చిత్రం అనుకోని చూడాలనుకునేవారు హిందీ లోనే చూడండి తెలుగులోనే చూడాలనుకుంటే మీ ఇష్టం.


చివరగా
తుఫాన్ : చరణ్ ఓకే.. రీమేక్ నాట్ ఒకే..
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com; 
Call: +91-40-4260-1008

More Articles on Thoofan | Thoofan Wallpapers | Thoofan Videos

" height='150' width='250' width="640" height="360" src="//www.youtube.com/embed/pn7CHj7lX2s" data-framedata-border="0">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: