నయనతార కొత్త లవర్ కి బ్రేకప్ చెప్పిందా..!

Edari Rama Krishna
తెలుగు, తమిళ, మళియాల ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నయనతార ఇప్పటికీ గ్లామర్ గా కనిపిస్తూ..హై రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘చంద్రముఖి’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ వరుసగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి హిట్స్ సాధించింది.  ఇక తెలుగు లో బాలయ్య సరసన నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.   ఇండస్ట్రీలో వివాదాస్పద హీరోయిన్ లీస్టు లో ముందుండే నయనతార ఇప్పటికే హీరో శింబు, ప్రభుదేవ లాంటి హీరోలతో లవ్ ఎఫైర్ నడిపించింది.  

ఒకదశలో కొరియేగ్రఫర్, దర్శకుడు, హీరో అయిన ప్రభుదేవతో పెళ్లి వరకు రావడం ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని తిరగడం జరిగింది.  అనుకోకుండా ఇద్దరి మద్య అభిప్రాయభేదాలు రావడంతో వారి లవ్ కి బ్రేకప్ చెప్పుకున్నారు.  తర్వాత ఈ అమ్మడు సినిమాలపై దృష్టి సారించింది..మంచి ఫిట్ నెస్ తో హై రెమ్యూనరేషన్ తీసుకుంటూ సంచలనం రేపింది. తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని బీచ్ ల వెంట కూడా తిరిగారని వార్తలు వచ్చాయి.  

దాదాపు వీరి పెళ్లి కూడా ఖాయమైనట్లు..త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.   నయన్  గత రెండేళ్లుగా యువ దర్శకులు విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తోంది. ప్రస్తుతం చెన్నై లోని ఓ స్టార్ హోటల్ లో మకాం ఉంటోంది నయనతార. ఇక దర్శకులు విగ్నేష్ శివన్ తో కూడా విడిపోయిందట ఇప్పుడు ఈ వార్త చెన్నై లో హల్చల్ చేస్తోంది.  అయితే ఈ దూరం శాశ్వత దూరమా ? లేక మళ్ళీ కోపం తగ్గగానే వెళుతుందా చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: