మనీ: రూ.2 లక్షల పెట్టుబడితో భారీ లాభాలు.. ఎలా అంటే..?

Divya
కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఆలోచనలు.. అభిప్రాయాలు.. జీవన శైలి కూడా పూర్తిస్థాయిలో మారిపోయాయి. కరోనా రాకముందు ఎవరికి కూడా హెల్త్ పైన అంత జాగ్రత్త ఉండేది కాదు. కానీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ముందు ఆరోగ్యం ఆ తర్వాతే జీవనం అన్నట్టుగా కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది బయటకు వెళ్లి ఉద్యోగం చేయలేక ఇంటి పట్టునే ఉంటూ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే రూ.2 లక్షల పెట్టుబడితో ఊహించని రేంజ్ లో లాభాలను సొంతం చేసుకోవచ్చు.
సొంతంగా బిజినెస్ ప్లాన్ చేయాలనుకునే వారికి ఫ్లై యాష్ బ్రిక్స్ బిజినెస్ చాలా ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.  తక్కువ పెట్టుబడితో.. 100 గజాల స్థలం.. రెండు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.  దీనితో మీరు ప్రతి నెల లక్ష రూపాయలకు పైగా సంపాదించే అవకాశం ఉంటుంది. వేగవంతమైన పట్టణీకరణ యుగంలో బిల్డర్లు చేసిన ఇటుకలను మాత్రమే ఉపయోగిస్తున్నారు.  దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ బిజినెస్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఇటుకలను విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే బూడిద , సిమెంటు మరియు రాతి దూళి మిశ్రమం తో తయారు చేస్తారు.
ఇందుకు వినియోగించే మాన్యువల్ యంత్రాన్ని సుమారు 100 గజాల స్థలం లో వుంచి ఈ యంత్రం ద్వారా తయారు చేసే ఇటుకల ఉత్పత్తి కోసం 6 మంది వ్యక్తులు అవసరం అవుతారు. రోజుకు 3 వేల ఇటుకలను సులభంగా తయారు చేయవచ్చు. ఒక్కో ఇటుక సుమారుగా 10 రూపాయల వరకు అమ్ముకున్న మీకు మంచి లాభం వస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇటుకల వ్యాపారంతో మంచి లాభాలను పొందవచ్చు.  పైగా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం పొందాలని చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: