మనీ: పోస్ట్ ఆఫీస్ ఖాతాలపై పెరగనున్న వడ్డీ.. రేట్లు పూర్తి వివరాలు ఇవే..!

Divya
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్ట్ ఆఫీస్ నుంచి ఎన్నో రకాల స్కీములు అందుబాటులో ఉన్నాయి. ఇక అందులో సేవింగ్ చేసే వారికి వివిధ రకాల వడ్డీ రేట్లు కూడా పెంచుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా కరోనా సమయంలో వీటి పై సేవింగ్ తగ్గినా..ఆ తర్వాత సేవింగ్ ఖాతాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే పోస్టాఫీసుల్లో లభించే వడ్డీ ఎక్కువగా ఉండడం కారణం చేత చాలా మంది పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు జమ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన కొన్నిరకాల పథకాలలో వడ్డీ రేట్లు కూడా పెరిగినట్లు సమాచారం. ఇకపోతే ఏ పథకంపై ఎంత వడ్డీ పెరిగింది అనే విషయాన్ని ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

జూలై ఒకటో తేదీ నుంచి పోస్ట్ ఆఫీస్ లోని డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ పొందవచ్చు అని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను జూన్ 30వ తేదీన నిర్ణయం తీసుకోనున్నారు. పెరుగుతున్న రెపోరేటు , పెరుగుతున్న ద్రవ్యోల్బణం అలాగే పెరుగుతున్న రుణ రేటు కారణంగా చిన్న పొదుపు పథకం పై కూడా వడ్డీ బాగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఆర్బీఐ రెపో రేటును పెంచిన అప్పటినుంచి బ్యాంకులు కూడా రుణాలను మరింతగా పెంచుతూ నే ఉన్నాయి . ఇక ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన,  నేషనల్ పెన్షన్ స్కీం,  కిసాన్ వికాస్ పత్ర, పి పి ఎఫ్ ఇటువంటి చిన్న పొదుపు పథకాలపై పెట్టుబడి పెడితే ఇక ఎక్కువ వడ్డీ పొందే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వం చిన్న పొదుపు పథకం పై కూడా వడ్డీరేట్లను పెంచవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచడానికి బ్యాంకులతో పాటు రిజర్వుబ్యాంకు రెండూ కూడా అనుకూలంగా ఉండడంతో ఇలా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ఎంత వడ్డీ పెంచారు అనే విషయం తెలియడం కోసం మనం ఈ నెల 30 తేదీ వరకూ ఎదురుచూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: