హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స సోదరుడు ఛాన్స్ ఇవ్వట్లేదుగా!

విజయనగరం జిల్లా రాజకీయాలపై బొత్స ఫ్యామిలీకి ఎంత పట్టు ఉందో అందరికీ తెలిసిందే. దశాబ్దాల కాలం నుంచి విజయనగరం రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పటిలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలో బొత్స జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. గత ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయడంలో బొత్స కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో బొత్స గెలవడంతో పాటు ఆయన సోదరుడు అప్పలనరసయ్య కూడా సూపర్ విక్టరీ కొట్టారు.


బొత్స వెనుకే ఉంటూ విజయనగరం జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న అప్పలనరసయ్య 2009లోనే కాంగ్రెస్ నుంచి గజపతినగరంలో పోటీ చేసి గెలిచారు. 2014లో కాంగ్రెస్ పని ఖతం అయినా సరే నరసయ్య అదే పార్టీ నుంచి పోటీ చేసి దాదాపు 44 వేల ఓట్లు వరకు తెచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల ముందు బొత్సతో పాటు వైసీపీలోకి వచ్చి, ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు.


ఇలా ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన అప్పలనరసయ్య, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారికి అండగా ఉంటారు. ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నరసయ్య సాయం చేస్తున్నారు. బొత్స మంత్రిగా ఉండటంతో మంచిగా నిధులు రాబట్టుకుని గజపతినగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు బాగా నరసయ్యకు బాగా ప్లస్ అవుతున్నాయి.


కాకపోతే గజపతినగరంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. రోడ్లని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. అటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. పలు గ్రామాల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది. అటు రాజకీయంగా చూసుకుంటే గజపతినగరంలో అప్పలనరసయ్యకు తిరుగులేదనే చెప్పొచ్చు. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. టీడీపీ తరుపున అప్పలనాయుడు పనిచేస్తున్నారు. ఈయన కుటుంబంలో ఉన్న అంతర్గత విభేదాలు టీడీపీకి మైనస్ అవుతున్నాయి. ఏదేమైనా బొత్స సోదరుడు గజపతినగరంలో మళ్ళీ టీడీపీకి ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: