మగాళ్ళ పక్క చూపులు....ఆడాళ్ళ ధుమ ధుమలు: కారణమేంటి?

మీరు మీ భర్త తో కలసి ఒక చల్లని సాయంత్రం మీరుమెచ్చే రెస్టారెంట్ లో కలసి ఒక అద్భుత సమయాన్ని గడుపుతున్న వేళ మీ టేబుల్ ప్రక్క నుండి ఒక యువతి నడుచుకుంటూ వెళ్తుంటే నీ వాడి చూపులు ఆమె పై పడటం అందులో ఏదో ఒక రకమైన మెరుపు, చూపుల్లో తన్మయం కల గలిపి ఆమెను నఖ శిఖ పర్యంతం గుండెల మీదుగా నడుమొంపులనుండి వెనక ఉన్నతాలపై నిలవటం జరిగింది మీరు గమనించారు. అంతా లిప్త పాటులో జరిగిపోయింది.


మగువల పట్ల మగవారి ఆకర్షణ అత్యంత సహజం. ఆమెలో సహజంగా ఉండే నయగారం వయ్యారం మగాళ్లు అప్రయత్నం గానే గమనించి వాళ్ల వైపు వీలైతే కనీసం లిప్తపాటైనా చూడటం సహజాతిసహజం. కుర్రకారే కాదు, పెళ్లయి పిల్లలున్న పెద్దొళ్లు కూడా ఇందుకు ఎలాంటి మినహాయింపు తీసుకోలేరు.




అయితే ఆస్థితి మీలో అసంకల్పితంగానే ఒకరకమైన ఉద్వెగం, అసూయ, ఆగ్రహం, వేదన, అభద్రత ఒక్కసారిగా కలసి ప్రశ్నల పరంపర మీ అంతరాంతరాల్లో ప్రవహించటం సహజం. అప్పుడే ఒక దాన్ని చూడగానే మీ మగాళ్ళు "చూపు తిప్ప లేరు, మీ మగ బుద్ధి పోనిచ్చుకోరు" అనుకుంటారు అవసరమైతే అవకాశముంటే బయటపెట్టటానికి వెనుకాడరు.


అంతేకాదు మీరంటే మీ వారికి ఇష్టం లేదా? మీపై ప్రేమ తగ్గిపోయిందా? మీకంటే ఆమె ఎక్కువ అందంగా ఉందా? భవిష్యత్ లో ఆయన మీమ్మల్ని మీ అందాన్ని పట్టించుకోరా?  ఇవీ ఆ ప్రశ్న పరంపరలు.




అస్తమానం ఆడవాళ్ల గురించి ఆలోచించే పురుషులేకాదు, బుద్దిగా భార్యను మాత్రమే ప్రేమించే భర్తలు కూడా పర స్త్రీ కనిపిస్తే చూడటం, చూడకుండా ఉండలేకపోవటం  అత్యంత సాధారణం. ఇలాంటి సందర్భాల్లోనే "మగ బుద్ధి పోనిచ్చుకోరు! చీ! అంటూ అని ఆడవాళ్లు సెటైర్లు వేస్తుంటారు"


ఇలాంటి అనుభవం మీకేకాదు ఏదో ఒక సంధర్బంలో ప్రతి మగువకు అనుభవైకవైధ్యమే. మనం దీన్ని అధిగమించ లేము. మగవారు అలా పర భామలను చూడటానికే ఇష్టపడతారు. స్పష్టకోసం, మగవాళ్ళంతా, మీ వారు మాత్రమేకాదు, ప్రతి అవివాహితుడు, ప్రతి క్రీడాకారుడు, ప్రతి మోసగాడు, స్త్రీలోలురు మొత్తం మగజాతి లక్షణమే అది. 




చివరికి కుటుంబ స్త్రీ సభ్యులతో కలిసి బయటకు వెళ్లినా "పరాయి స్త్రీ" వైపు కన్నెత్తి ఓరగా చూడటానికి కారణమేంటో తెలుసా?


ఉదాహరణకు నా జీవితభాగస్వామితో దాంపత్య జీవితం నాలుగైదేళ్ళుగా ఎంతో మధురంగా, ప్రేమగా, ఆమెను కలలో కూడా మోసగించటానికి కూడా ఇష్టపడను. జీవితమంతా ఆమె సాన్నిహిత్యంలోనే గడపటం నా జీవితాశం. అంతలా ఆమెను ప్రేమించే నేనుకూడా ప్రక్కనుంచి ఒక వయ్యారి భామ నడచి వెళ్తుంటే మాత్రం నాకు నచ్చినట్లు చూడకుండా ఉండటాన్ని అదుపు చేసుకోలేక పోతున్నను. ఎందుకంటే ఆమె నడకలోనో, నడతలోనో, రూపంలోనో, పొంకంలోనో, భింకంలోనో   ఆ ఫిగర్లో నాకు నచ్చి నన్ను ఆకర్షించే ఫీచెర్స్ కొన్ని ఉండొచ్చు.  ఇది నా ప్రకృతి అంటే సహజం. ఇలాంటిది నేనొక్కణ్ణేకాదు...అందరు మాగాళ్ళు ఇంతే.


కొంత మంది డైరెక్ట్‌ గానే అమ్మాయిల వైపు చూస్తే, కొందరు మాత్రం భార్య పక్కనున్నప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పెళ్లాం పక్కకు తిరగ్గానే, చటుక్కుమని అందాల భామలని  చూసేస్తుంటారు. దీని అర్థం వారికి మీపై ప్రేమ తగ్గడమో, పరాయి స్త్రీల వ్యామోహమో కాదు. అదొక బలహీనత అంత కంటే కాదు....కారణమేమంటే:


మగాళ్లకు ప్రక్క చూపులు సహజం. ఆడాళ్ళకీ కూడా సహజం తనవాడు చూసే పక్క చూపులు తాను గమనిస్తే, తన గుండె లోపలి పొరల్ని తన్నుకుని ఉద్రేకం ఆగ్రహం పెల్లుబకటం.




కాకపోతే ఏ మహేష్ బాబునో, ప్రభాస్‌నో, అరవింద్ స్వామినో చూడగానే అమ్మాయిలు ఎలా ఆకర్షణకు లోనవుతారో....ఇదీ కూడా అంతే. అలాంటి అమ్మాయిలతో మాటలు కలిపి చెట్టాపట్టాలేసుకొని తిరగనంత వరకూ ఇది ఏమాత్రం హానికరం కాదు. అలా జరిగినట్లే తెలిస్తే మాత్రం ఉపేక్షించొద్దు.....క్షమించొద్దు....సుమా!


మీ భర్త ఓ అమ్మాయి వంక తదేకంగా చూస్తున్నాడంటే ఆమె మీ కంటే ఆకర్షించేలా ఉందని అర్థం. అందమైన ఆడవాళ్ల ను చూస్తే మగాళ్లల మెదడులో రసాయనిక మార్పులు సంభవిస్తాయి. "సెరటోనిన్‌, డోపమైన్ హార్మోన్లు" విడుదల అవుతాయి. ఇవి తెలియని అదో రకమైన సంతృప్తిని దేహమంతా కలిగిస్తాయి. ఈ భావోద్వేగాలు తన్మయం లాంటి చక్కటి హాయి నిస్తాయి. కొందరైతే ఊహల్లో తేలిపోతారు.....అంతే అంతకుమించి ఏమీ కాదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: