
నెయ్యిని ఎక్కువ తీసుకోవడం వల్ల లాభమా? నష్టమా?
అధిక రక్తపోటు, గుండెపోటు, అథిరోస్క్లెరోసిస్ లాంటి సమస్యలు రావచ్చు.కొందరికి లాక్టోజ్ ఇంటోలరెన్స్ లేదా డైరీ ప్రొడక్ట్స్‌కు అలెర్జీ ఉంటే, నెయ్యి తీసుకోవడం వల్ల కడుపునొప్పి, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలు ఏర్పడవచ్చు.ఆయుర్వేదం ప్రకారం, అధికంగా నెయ్యి తీసుకోవడం వల్ల పిత్త దోషం ఏర్పడి మంట, జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. నెయ్యి ఎక్కువగా తినటం ఆరోగ్యానికి మంచిదే అనే చాలామంది అనుకుంటారు. కానీ మరి ఎక్కువగా తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక స్పూన్ నెయ్యి కోల్ వెచ్చని నీటిలో వేసి తాగాలి. ఉదయం పూట మాత్రమే తాగాలి.
గోరు వెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగటం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. గుండెకు సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. నెయ్యి శరీరానికి తేమను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా, కాంతిగా మారుస్తుంది. మెదడుకు మంచి పోషణ అందుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి సరైన విధానంలో నెయ్యిని ఉపయోగించడం మంచిది. నెయ్యి ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీనిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. నెయ్యి అధికంగా తీసుకుంటే అధిక క్యాలరీలు శరీరంలో నిల్వ ఉండి స్థూలకాయానికి కారణమవుతుంది.