శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి... ఆ వ్యాధి సంకేతం కావచ్చు !
శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పి సంభవించడం డయాబెటిస్ డెవలప్ అవుతుందన్న సంకేతాలని నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏ కారణం లేకుండానే తరచుగా పేర్ల నొప్పులు వేధిస్తుంటే అది మధుమేహా లక్షణాల్లో ఒకటిగా అనుమానించాలి. ఎందుకంటే వైద్య నిపుణుల ప్రకారం... రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల ఇలా జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఎముకలు, కండరాలు బలహీన పడతాయి. పొట్ట కండరాలు, నడుము భాగంలో కూడా నొప్పిగా అనిపించవచ్చు. అలాగే కీళ్లలో వాపు,కదలికల్లో ఇబ్బందులు తీవ్రమవుతాయి. కాబట్టి అకారణంగా కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అలాంటప్పుడు డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఎప్పుడో ఒక్కసారి భుజాల్లో పెయిన్ అనిపిస్తే అది కామన్. కానీ అప్పుడప్పుడు వస్తు వేధిస్తుంటే మాత్రం అది షుగర్ వ్యాధి సంకేతం కూడా కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా రోజులుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారు ఎంతకైనా మంచిది షుగర్ టెస్ట్ లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పనిచేస్తున్నప్పుడో, ఖాళీగా కూర్చున్నప్పుడో ఒక్కసారిగా చేతులు జలదరిస్తుంటాయి. తిమ్మిర్లు పడుతుంటాయి. ఎప్పుడో ఒక్కసారి ఇలా జరిగితే అది సరైన పోజషన్ లో వచ్చాకపోవడమో, బాడీ సహజమైన ప్రక్రియలో భాగము అనుకోవచ్చు.