శరీరంలోని స్ట్రెస్ హార్మోన్లతో ఇంత ప్రమాదమా?
అంటే దాదాపుగా అన్ లిమిటెడ్ స్టోరేజ్ అన్నమాట.. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ జ్ఞాపకాలతో లాభాలు ఉన్నాయి. నష్టాలు ఉన్నాయి. ఇలా బ్రెయిన్ కు సంబంధించిన ఎన్నో అంశాలపై శాస్త్రవేత్తలు ఎలాంటి ఆధ్యయనం చేశారో, నివేదికలో ఏం వెల్లడించారు ఇప్పుడు తెలుసుకుందాం. మానవ మెదడులోని ' అమిగ్డాలా' అనే భాగం జ్ఞాపకాలకు సంబంధించిన భావోద్వేగాలను నియంతరిస్తుందని పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు. మెదడులోని హిప్పోకాంపస్ అనేది జ్ఞాపకాలు ఏర్పడే ప్రాంతం. జీవితంలో భయానక లేదా బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ జ్ఞాపకాలకు అమిగ్డాలా మెదడులో నిల్వ చేస్తుంది. జ్ఞాపకాలాన్ని ' లింబిక్ సిస్టమ్' విభాగంలో అలాగే నిండి ఉంటాయి.
అడ్రినలిన్, కార్టసార్ వంటి ' స్ట్రెస్ హార్మోన్లు' ఈ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్లు భయం, ఒత్తిడి వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పెరుగుతాయి. దాని కారణంగా ఆ సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు చాలా కాలం పాటు మనసులో అలాగే నిలిచి ఉంటాయి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మానవ మెదడు భయంకరమైన, బాధాకర యంత్రాంగంగా బాధ పరుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, ఇది వారి మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అనేక సందర్భాల్లో, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ కారణంగా, భయానక జ్ఞాపకాలు మళ్లీ ఈ పాత గాయాలను రిఫ్రెష్ చేస్తాయి.