డైట్ పాటిస్తున్న.. ఇటువంటి సమస్యలు వస్తున్నాయంటే?.. మీరు చేస్తున్న తప్పులు ఇవే..!
అందుకోసం కొందరు డైట్ పాటించటంతో పాటు వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. అలాంటప్పుడు మీకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుండవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. డైట్ పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గటం లేదంటే మీరు రాత్రి భోజనంలో అధిక కార్బోహైడ్రేట్లు తీసుకుంటూ ఉండవచ్చు. చాలామంది ఈ విషయాన్ని గుర్తించరు. ఎందుకంటే సాధారణ ఆహారమే తింటున్నాం అనుకుంటారు. కానీ వీరు తినే ఆహారంలో అధిక చక్కెర స్థాయిలు అధిక కార్బోహైడ్రేట్లు ఉండి ఉంటాయి.
ఇలాంటప్పుడు ఎన్ని వ్యాయామాలు చేసినా, పగలు ఎంత డైట్ పాటించిన ఫలితం ఉండదంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలని కొందరు గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే మీ శరీర తత్వాన్ని బట్టి వ్యాయామం ఎంతసేపు అవసరం అనేది తెలుసుకొని పాటిస్తే మంచిది. అంతే తప్ప బరువు తగ్గాలని అధిక వ్యాయామాలు చేసినంత మాత్రాన తగ్గరు. పైగా ఎక్కువసేపు చేయడం వల్ల కండరాలు మరింత బలాన్ని పొందుతాయి. దీంతో మరింత బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అధిక ఒత్తిడి కూడా వెయిట్ లాస్ అవ్వకుండా అడ్డుపడుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినేవారు కూడా ఎంత చక్కటి డైట్ పాటించిన అధిక బరువు తగ్గే ఛాన్స్ ఉండదు అంటున్నారు నిపుణులు.