టీడీపీతో జనసేన కలిసి ఉంటే కూటమికి తిరుగులేదా.. పవన్ కు రికార్డులు సాధిస్తున్నారుగా!

Reddy P Rajasekhar

2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సంచలన ఫలితాలను  సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే  పవన్ కళ్యాణ్ కు  సక్సెస్ సులువుగా దక్కలేదు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2008 సంవత్సరంలో  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.  ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షునిగా పని చేశారు.  

2011 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పరంగా  విరామం తీసుకున్నారు.    2014 సంవత్సరం మార్చి నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.  ఆ ఎన్నికల్లో  టీడీపీ, జనసేన  కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు.  2014 ఎన్నికల్లో కూటమి ఘన  విజయం సాధించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు.

 ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల 2019 ఎన్నికల్లో జనసేన 140 స్థానాల్లో పోటీ చేసింది.  2019 ఎన్నికల్లో పవన్  భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయగా వేర్వేరు కారణాల వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే రాజోలు నియోజకవర్గంలో మాత్రం జనసేన పార్టీ   విజయం సాధించింది.  2019 ఎన్నికల్లో జనసేనకు ఆశించిన ఫలితాలు రాకపోయినా పవన్ మాత్రం   ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆందోళనలు  నిర్వహించడంతో పాటు వైసీపీ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

2024 ఎన్నికల్లో  పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏపీలో పోటీ చేయగా రాష్ట్రంలో 164 స్థానాల్లో  మూడు పార్టీల కూటమి విజయం సాధించింది.  వైసీపీ మాత్రం కేవలం 11 స్థానాల్లో  మాత్రమే విజయం సాధించింది.  పవన్  పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి పొలిటికల్ కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు. పవన్ కు మంత్రి పదవి దక్కడంతో పాటు   డిప్యూటీ  సీఎంగా  కూడా పవన్ పని చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: