భరించలేని తలనొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలు కచ్చితంగా పాటించండి!

Reddy P Rajasekhar

భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు . నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలామందిని వేధించే ప్రధాన సమస్య తలనొప్పి. ఈ నొప్పి రాగానే వెంటనేమీకోసమే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానికి బదులుగా ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

ముందుగా తలనొప్పిగా అనిపించినప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని నెమ్మదిగా తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి. అల్లం టీ తలనొప్పికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్త నాళాల్లో వాపును తగ్గించి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. అలాగే తలకి కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో మెల్లగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది.

మీకు మైగ్రేన్ వంటి సమస్య ఉంటే చీకటిగా, ప్రశాంతంగా ఉన్న గదిలో కాసేపు కళ్లు మూసుకుని పడుకోవడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. పుదీనా ఆకుల రసాన్ని నుదుటిపై రాసుకున్నా లేదా పుదీనా వాసన చూసినా ఆ రిఫ్రెషింగ్ గుణం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ పని ఒత్తిడి వల్ల తలనొప్పి వస్తుంటే, ఐదు నిమిషాల పాటు ప్రాణాయామం లేదా శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా మారి తలనొప్పి మాయమవుతుంది.

కాఫీ లేదా టీ తాగడం వల్ల కూడా కొంతమందికి తలనొప్పి తగ్గుతుంది కానీ అది అలవాటుగా మార్చుకోకూడదు. వీటన్నింటితో పాటు కంటి నిండా కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం వల్ల భవిష్యత్తులో తలనొప్పి రాకుండా నివారించవచ్చు. ఒకవేళ ఈ చిట్కాలు పాటించినా నొప్పి తగ్గకపోతే లేదా తరచుగా వస్తుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: