పవన్ ముఖ్యమంత్రి అయ్యేది అప్పుడేనా.. ఆ రికార్డును పవన్ కళ్యాణ్ సాధిస్తారా?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. క్రేజ్ అనే పదానికి పవన్ కళ్యాణ్ పర్యాయపదం అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ ను సీఎం పదవిలో చూడాలనేది అభిమానుల ఆకాంక్ష కాగా ఆరోజు ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఏదో ఒకరోజు కచ్చితంగా సీఎం అవుతారని ఆయన అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.
ఒకవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగిస్తూ సంచలన విజయాలను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు. ఇటీవల పవన్ ఓజీ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వాగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దసరా పండుగ సెలవులను సైతం, ఈ సినిమా క్యాష్ చేసుకుంది.
తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తీ చేయగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఓజీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుండగా ఈ సినిమా సీక్వెల్ లో పవన్ నటిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించి ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.