చలికాలంలో మీ కళ్ళు తస్మాత్ జాగ్రత్త ... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..!
సాధారణంగా చలికాలంలో అనేక కంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి . ఈ సమస్యల్లో మీకు కళ్ళల్లో నొప్పి మరియు కళ్ళు ఎర్రబడడం అదేవిధంగా నీరు కమ్మడం, తీవ్రమైన నెప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి . అయితే చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు . అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు . ఇది కొన్ని కంటి జబ్బుల లక్షణం రావచ్చని వీటిని తక్షణమే చూపించుకోకపోతే కన్నుకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలియజేస్తున్నారు . మరి శీతాకాలంలో ఏ కంటి వ్యాధులు వచ్చే ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం .
1. ఈ సీజన్లో కండ్లకలక అనే కంటి వ్యాధి రావచ్చు. కండ్ల కళకళ అనేది చలికాలంలో కూడా వచ్చే సాధారణ కంటి వ్యాధి . ఇది వాపు మరియు కళ్ళలో నీరు కామడం వంటి లక్షణాలను కలిగిస్తుంది . ఈ వ్యాధిని సమయానికి నియంత్రించడం చాలా ముఖ్యం . లేకుంటే ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది .
2. బ్లెఫారిటీస్ అనేది ఒక రకమైన కంటి వ్యాధి . దీనిలో కనురెప్పలు ఉబ్బుతాయి . చలికాలంలో ఇది చాలా సాధారమైన సమస్య . అయితే దీనిని పరిష్కరించడం చాలా ముఖ్యం . చలికాలంలో డ్రై ఐ సిండ్రోమ్ వస్తుందని నిపుణులు అంటున్నారు .
అలాగే గాలిలో తేమ లేకపోవడం వల్ల కళ్ళు పొడిబారడం జరుగుతూ ఉంటుంది . ఇది చికాకు మరియు వాపు అదే విధంగా కళ్ళు నుంచి నీరు కారడం ఎటువంటి సమస్యలకు ఎదురవుతుంది .
చలికాలంలో కంటి సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం . ఈ కాలంలో మీ కళ్ళను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి . గోరువెచ్చని నీటితో కళ్ళు శుభ్రం చేసుకోవాలి . కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి వ్యాధులను గుర్తించుకోవచ్చు . అదేవిధంగా డాక్టర్ సలహా మేరకు కంటి చిట్కాలు పాటించాలి .