సినీ ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరోయిన్ తమ్ముడు మృతి..!
అయితే అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గానే ఉంటూ పలు రకాల విషయాలను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా హీరోయిన్ భాను శ్రీ మెహ్రా ఇంట విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ఈమె సోదరుడు నందు ఏడు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో మరణించాడట.. ఈ విషయాన్ని భాను శ్రీ మెహ్రా తలుచుకొని మరి ఎమోషనల్ అవుతూ ఒక పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన సోదరుడు మరణించి ఇప్పటికీ ఏడు రోజులు అయింది అని ఇది ఇంకా పీడకలలాగే ఉందంటూ తెలిపింది.
తన తమ్ముడు మరణించిన వార్త నమ్మలేకపోతున్నానని నువ్వు గుర్తుకు వస్తున్నావు నువ్వు లేవని బాధను కూడా జీవితాంతం మోయాల్సి ఉన్నది.. తన మనసులో ఎప్పటికీ తనకి స్థానం ఉంటుంది ఐ మిస్ యు నందు అంటే తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది భాను శ్రీ మెహ్రా.. ఈ పోస్ట్ చూసిన అభిమానుల సైతం ఈమెకు ధైర్యం చెబుతూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.ఈమె చివరిగా 2022లో వచ్చిన టెన్త్ క్లాస్ డైరీ అనే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు భాను శ్రీ మెహ్రా.