మోహన్ బాబుకు బిగ్‌ షాక్‌...అరెస్ట్ పై రాచకొండ సీపీ సంచలన ప్రకటన.. ?

Veldandi Saikiran
మంచు మోహన్ బాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది. మంచు మోహన్ బాబు ఇష్యూపై రాచకొండ సీపీ సుధీర్‌ బాబు సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చూస్తుంటే.. ఈ నెల 24 వ తేదీ తర్వాత.. మంచు మోహన్ బాబు అరెస్ట్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికీ మంచు మోహన్ బాబు కుటుంబం పై 3 FIR లు నమోదు అయ్యాయన్నారు. మంచు మోహన్ బాబు కుటుంబం పై 3 FIR లు నమోదు అయిన తరుణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని వివరించారు. లీగల్ గా మేము ఏమి చేయాలో అది చేస్తామన్నారు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు.

మోహన్ బాబు కు ఇప్పటికే నోటీసు ఇచ్చామన్నారు. ఈ నెల 24 వరకు టైం అడిగారని పేర్కొన్నారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదని వెల్లడించారు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు. మోహన్ బాబు విచారణ పై మేము కూడా కోర్టును అడుగుతామని చెప్పారు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు. మోహన్ బాబు వద్ద గన్ లు చంద్రగిరి లో ఉన్నపుడు తీసుకున్నాడని వెల్లడించారు.

రాచకొండ నుంచి ఎలాంటి పర్మిషన్ గన్స్ లేవని వివరించారు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు. 2 గన్స్ మోహన్ బాబు వద్ద ఉన్నాయని చెప్పారు. Dbpl, ఒకటి మరొకటి స్పానిష్ మెడ్ గన్ ఉందని స్పష్టం చేశారు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు.  మళ్ళీ నోటీసు ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ అవ్వాలని వెల్లడించారు. మళ్ళీ టైం కావాలి అంటే పర్మిషన్ తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారు. లేదంటే వారెంట్‌ ఇష్యూ చేస్తామని హెచ్చరించారు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు. నిన్న వెళ్లి పిటిషనర్ ను కలిశాడని..దానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మోహన్‌బాబు దగ్గర మెడికల్‌ రిపోర్ట్‌ తీసుకోవాలని.. దానిపై మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: