ఎన్టీఆర్ 'దేవర' పాటకి.. రాజమౌళి అదిరిపోయే డాన్స్.. వైరల్ వీడియో?
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు, దర్శక ధీరుడు అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి గురించి జనాలకి చెప్పాల్సిన పనిలేదు. ఆయన పేరు చెబితే ఇపుడు ప్రపంచమే సలాం చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అవును, బాహుబలి అనే సినిమాతో ఆయన తెలుగు సినిమా షేప్ మార్చివేశారు. దెబ్బకి నిన్న మొన్నటి వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే చెప్పుకొనే బాలీవుడ్ కుదేలు అవ్వక తప్పలేదు. ఇపుడు ఇండియన్ సినిమా అంటేనే తెలుగు సినిమా అనే స్థాయికి చేరింది మన ఘన కీర్తి. అయితే జక్కన్న తనలో డైరెక్టరే కాదు మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని తాజాగా నిరూపించారు. అవును, గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న డ్యాన్స్ వీడియోలే దానికి ఉదాహరణ.
తాజాగా జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన 'దేవర' మూవీలోని 'ఆయుధ పూజ' పాటకు జక్కన్న వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియోలో ఆయన గ్రేస్‌తో చేసిన డ్యాన్స్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. విషయం ఏమిటంటే... యూఏఈలో జరిగిన సంగీత దర్శకుడు, తన సోదరుడు కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి వేడుకలో ఆయన ఈ డ్యాన్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఇదే పెళ్లి వేడుకలో తన భార్య రమతో కలిసి రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయిన సంగతి విదితమే. ఇలా జక్కన్నలో మరోకోణం చూసి మరికొంతమంది అయితే మిక్కిలి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి అందరికీ తెలిసినదే. కాగా ఈ కాంబోపైన తొలి నుంచే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. కాగా తాజాగా ఈ సినిమాలో మహేష్ జంటగా నటించడం కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాని సెలెక్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం ప్రియాంకతో టీమ్ చర్చలు జరిపిందని, అందుకు ప్రియాంక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న మాట. మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబు హీరోయిన్‌గా నటించడం కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్వాని, ఇండోనేషియా ముద్దుగుమ్మ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ, ప్రియాంకను ఫైనల్ చేయాలని మూవీ టీమ్ చెప్తోంది. అయితే దీనిపైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.