చలికాలం కదా అని నీళ్లు తక్కువగా తాగితే.. ఈ రిస్క్ తప్పదంటున్న నిపుణులు!

lakhmi saranya
చలికాలం అని నీళ్లు ఎక్కువగా తాగటం లేదా? చలికాలం అని నీళ్లు తాగకపోవటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. చలికాలం అయినా కానీ రోజుకి కనీసం 2 లీటర్లు అయినా నీళ్లు తాగాలి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో దాహం ఎక్కువగా వెయ్యదు. కూల్ వెదర్ కారణంగా చాలామంది వాటర్ తక్కువగా తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి సీజన్లతో సంబంధం లేకుండా రోజుల్లో 2 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగితేనే హెల్తీగా ఉంటామని పేర్కొంటున్నారు.
ఒకవేళ అంతకంటే ఎక్కువగా తాగినా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ నీరు తాగటం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏవో చూద్దాం. ఇంటర్లో నీళ్లు తక్కువగా తాగితే ఆ ప్రాబ్లం మొత్తం శరీరంపై పడుతుంది. అవయవాలకు సరఫరాలో తేడాలు వస్తాయి. దీనితో పాటు తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా క్రానిక్ ఫెటిగ్ కు దారితీయవచ్చు. అంటే ప్రతిరోజు తీవ్రమైన అలసట లేదా తలనొప్పి వంటివి అనుభవించే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. కాబట్టి దాహం వేయకపోయినా శరీరానికి సరిపడా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
 లేకపోతే డిహైడ్రేషన్ బారిన పడి, ఇతర అనారోగ్యాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. తగినంత నీరు తాగకపోవటం వల్ల శరీరంలో పొటాషియం, సోడియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బ తింటుందని ఆరోగ్యా నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. హార్ట్ రేట్ లో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. అంతేకాకుండా నీరు తక్కువగా తాగటం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ క్రమంగా జరగని కారణం గా అవయవాత పనితీరు మందగిస్తుంది. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంటర్లో తక్కువ నీరు తాగటం మెటబాలిజం పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: