శరీరంలో ఎనర్జీ అధికమైనా కష్టమే.. అప్పుడు జరిగే మార్పులు ఇవే!

frame శరీరంలో ఎనర్జీ అధికమైనా కష్టమే.. అప్పుడు జరిగే మార్పులు ఇవే!

lakhmi saranya
మనం ఏదైనా పని చేయాలని అనుకుంటాము కానీ చేయలేకపోతుంటాము. నీరసం వచ్చినప్పుడు అసలు చేయలేక పోతాము. మీరు ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నంత మాత్రాన సరిపోదు. మెంటల్లీ, ఫిజికల్లీ అందుకు సంసిద్ధంగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఒక వర్క్ ఫర్ ఫెక్ట్ గా చేయాలంటే బాడీకి ఎనర్జీ అవసరం. రెగ్యులర్ ఫంక్షనాలిటితో పాటు ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు, అనుకోని ఇబ్బందులు తలెత్తుతున్నప్పుడు, వ్యాధుల నుంచి కోలుకోవటానికి సాధారణ పరిస్థితులకు మించి అదనపు శక్తి అవసరం అవుతుంది. అయితే కొన్నిసార్లు ఈ శక్తి ఓవర్ లోడ్ అయినా సమస్యగా మారుతుంది.
కాబట్టి శరీరం ఎక్సెస్ ఎనర్జీని బయటకు పంపుతుంది. ఈ సందర్భం గానే బాడీలో ఇబ్బందికరమైన తాత్కాలిక అసౌకర్యం కలుగుతుంది. అయినప్పటికీ తర్వాత మాత్రం రిలాక్స్ అవుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎక్సెస్ ఎనర్జీ రిలీజ్ సమయంలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమో ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు అనుకోకుండా కండరాలు మెలితిప్పినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొందరికి మజిల్స్ వణకడం లేదా సంతోషించడం వంటివి కూడా జరగవచ్చు. అయితే ఈ కండరాల కదలికలు మనకు మేలు చేస్తాయి. ఎందుకంటే అదనపు ఎనర్జీని బయటకు వెళ్లేందుకు శరీరంలో బ్లాకేజిలను క్లియర్ చేస్తాయి.
 దీంతో శరీరంలో ఎనర్జీ బ్యాలెన్స్ రిస్టోర్ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పేరుకుపోయిన అదనపు శక్తిని శరీరం బయటకు వదిలే క్రమంలో మనలో అకస్మిక బాగోద్వేగాలు కూడా సంభవిస్తుంటాయి. ఉదాహరణకు పరిస్థితిని, ప్రభావాన్ని బట్టి కోపం, నవ్వు, ఏడుపు వంటివి మనలో వ్యక్తం కావచ్చు. అయితే ఇవన్నీ ఒక రకంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా స్ట్రెస్ రిలీఫ్ కలిగిస్తుంది. అందుకే చాలామంది ఏడ్చిన తర్వాతనో, నవ్విన తర్వాతనో చూస్తే రిలీఫ్ గా అనిపిస్తుంటారు. శరీరంలో అవసరం లేని ఎక్సెస్ ఎనర్జీ బయటకు పోయి, అవసరం మేరకు రి స్టోర్ అవ్వడమే ఎందుకు కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: