మోకాళ్ల నలుపు పోవాలంటే... ఈ టిప్స్ పాటించండి...!
ఇలా 5 నిమిషాల పాటు మర్దనా చేసి, శుభ్రంగా కడిగేయాలి. ఇది మోకాళ్లు నలుపును తగ్గించడంలో సహాయపడుతుంది. అరటి తొక్క, దీనివల్ల చర్మం మాయిశ్చరైజ్ అవుతుంది. శనగపిండి, టమాటాను కలిపి మోకాళ్లు, మోచేతులకు మర్దన చేసి, అలాగే 30 నిమిషాల పాటు వదిలేయాలి. తరువాత శుభ్రంగా కడిగేయాలి. మోకాళ్లు నలుపును తగ్గించడానికి నారింజ స్క్రబ్ ఉపయోగపడుతుంది. ఓ టీ స్పూన్ కాఫీ పొడిని, టీ స్పూన్ కొబ్బరి నూనెలో కలపాలి. ఆ తరువాత నారింజ తొక్కతో ఆ విశ్రమాన్ని కొంచెం కొంచెం గా తీసుకుంటూ 10 నిమిషాల పాటు మర్దనా చేసి, నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నలుపు రంగు తగ్గుతుంది. నిమ్మరసం మోకాళ్లపై ఉన్న నలుపు రంగును తొలగించటంలో సహాయపడుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విశ్రమాన్ని టమాటా ముక్కతో మోకాళ్ళపై సున్నితంగా స్క్రబ్ చెయ్యాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయటం వల్ల ఫలితం ఉంటుంది. పంచదార, ఆలివ్ ఆయిల్ నలుపు రంగును తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో పంచదార వేసుకుని, సునీతంగా స్క్రబ్ చేయాలి. తరువాత సబ్బు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. మీ మోకాలు, మోచేతులు నలుపు రంగు తగ్గుతుంది.