పవర్ లిఫ్టింగ్ తో మోస్ట్ బెనిఫిట్స్... సెలబ్రిటీలు ఫాలో అయ్యేది అందుకేనా?

lakhmi saranya
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వ్యాయామాలు తప్పకుండా చేయాల్సిందే. వ్యాయామాలు చేయటం వల్ల బాడీ అనేది ఫిట్ గా మారుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాయామాలని చేయవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్గా వ్యాయామాలు చేయటం మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఇందులోనూ హెచ్ ఐఐటి, కార్డియో, పవర్ లిఫ్టింగ్ వంటి పలు రకాలు ఉంటాయి. కాగా ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ఎక్సెర్ సైజ్ లలో పవర్ లిఫ్టింగ్ ఒకటి. ఇది మానసి, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందని ఫిట్ నెస్ నిపుణులు అంటున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.
 పవర్ లిఫ్టింగ్ నిజానికి ఒక అద్భుతమైన శారీరక వ్యాయామం. దీనివల్ల బాడీలో స్ట్రెంత్, అలాగే మజిల్స్ పెరుగుతాయి. ఇందులో భాగంగా ఉండే స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ వంటివి రెగ్యులర్గా చేసే వారికి మిగతా వారితో పోలిస్తే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఎముకలు బలంగా మారుతాయి. బోన్ డెన్సిటీ పెరుగుతుంది. శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. పవర్ లిఫ్టింగ్ వ్యాయామం మెంటల్ హెల్త్ పరంగానూ అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా చేసే వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్ట్రెస్, యాంగ్జైటిస్, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది.
దీంతో చేసే వర్క్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టగలుగుతారు. తద్వారా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పవర్ లిఫ్టింగ్ కారణంగా శరీరంలో ఇన్సులిన్  సెన్సిటివిటీ పెరుగుతుంది. షుగర్ పేషెంట్లు కూడా పవర్ లిఫ్టింగ్ వ్యాయామం చేయవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాకపోతే ఈ సందర్భంగా గాయాలు తగలకుండా జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. శరీరంలోని బాడ్ కొలెస్ట్రాల్ ను బర్న్ చేయటంలో కూడా పవర్ లిఫ్టింగ్ సహాయపడుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అయితే దీనిని ప్రారంభించే ముందు మీ శరీరం తత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వారు కోచ్ లేదా ట్రైనర్ సలహాలను తప్పకుండా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: