"సామ్" కు పిల్లలు కావాలి.. "చై"కు పిల్లలు కావాలి.. కానీ అదే బిగ్ ప్రాబ్లం..అందుకే విడాకులు తీసుకున్నారా..?

Thota Jaya Madhuri
ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా నడుస్తుంది.  సమంత - నాగచైతన్య డివర్స్ విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది . మరి కొద్ది రోజుల్లోనే శోభిత ధూళిపాళ్లతో కొత్త బంధం స్టార్ట్ చేయబోతున్న నాగచైతన్య. వీళ్ల పెళ్లికి సంబంధించిన అన్ని పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ మధ్య వీళ్ల పెళ్లి పోస్ట్ పోన్ అయ్యిందంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితె ఎక్కడా కూడా దానికి సంబంధించి అఫిషియల్ ప్రకటన అయితే రాలేదు.


తాజాగా రానా టాక్  షో కి  నాగ చైతన్య గెస్ట్ గా వచ్చారు . దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . అయితే ఈ ప్రోమోలో నాగచైతన్య తనకు పిల్లలు కావాలని ఉంది అంటూ చెప్పడం హైలైట్ గా మారింది. ఎందుకంటే నాగచైతన్య - సమంతకు విడాకులు ఇచ్చేసింది ఈ కారణంగానే అంటూ ఎప్పటినుంచో ట్రోల్ జరుగుతుంది . ఒకపక్క సమంత కూడా పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలి అని అనుకునింది అంటూ శాకుంతలం సినిమా సైన్ చేయలేకపోయింది అంటూ ఆ సినిమాకి సంబంధించిన స్టార్స్ చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో నాగచైతనే తనకు పిల్లలు కావాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు .


అసలు వీళ్ళిద్దరూ పిల్లల విషయంలో కాకుండా ఏ కారణంగా విడాకులు తీసుకున్నారు . కొంపదీసి కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో నిజం ఉందా ..? అంత పెద్ద స్టార్ సెలబ్రెటీస్ ఎటువంటి రీజన్ లేకుండా ఎందుకు విడాకులు తీసుకుంటారు ..? అంటూ జనాలు చర్చించుకుంటూ మాట్లాడుకుంటున్నారు.  అయితే గతంలో ఓ హీరోయిన్.." సమంతని అక్కినేని ఫ్యామిలీ ఒక్క అమ్మాయిలా  చూడలేదు అని.. ఆమెను ఒక డబ్బు ఇచ్చే మెషిన్ లా చూశారు కానీ..ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఆమెకు విసుగు వచ్చే ఆ పద్ధతులు ఫాలో అవ్వలేక ఆ దారుణాలు భరించలేక విడాకులు తీసుకుంది" అని చెప్పుకొచ్చింది . బహుశా అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అంటున్నారు జనాలు .  ఏమో అసలు వీళ్లు ఎందుకు విడాకులు తీసుకున్నారో ..? ఆ విషయం ఓపెన్ గా చెప్తే వీళ్ళకి తలనొప్పులు ఉండవు కదా..? అంటున్నారు జనాలు . చూద్దాం ఆ విషయాన్ని ఎప్పటికైనా బయట పెట్టకపోతారా ఈ రొమాంటిక్ మాజీ జంట..!???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: