టాయిలెట్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారా...? ఈ సమస్యలు తప్పవు!
టాయిలెట్ పై 5 నుంచి 10 నిమిషాలకంటే ఎక్కువ సమయం కూర్చోకూడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సమయం కూర్చోవటం వల్ల శరీరంలో రక్తప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మలం ద్వారా, పురుషనాళం చుట్టూ ఉన్న రక్త నాళాలు బ్లాక్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో చాలామంది ఎక్కువ సేపు టాయిలెట్ లోనే ఉంటారు. అలా ఉండటం వల్ల మలం విసర్జించడంలో నిరంతర సమస్యలు కారణమై, పేగు సిండ్రోమ్ వంటి జీర్ణాశయ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మలబద్ధకం పెరగటం, ఎక్కువసేపు టాయిలెట్ లో కూర్చోవడం వంటివి క్యాన్సర్ కు సంకేతాలు. టాయిలెట్ లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పొట్ట సరిగా శుభ్రంకాక జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
ఇది ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా శరీర బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. టాయిలెట్ సిటు పై గంటల తరబడి కూర్చోవడం వల్ల హెమరాయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై కూర్చుని ఎక్కువ సమయం మొబైల్ చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో మలాన్ని బయటకు పంపడానికి కండరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మలం బయటకు వెళ్లకుండా ఇబ్బంది పెడుతుంది. అలా జరుగుతున్నట్లై ఇది పైల్స్ కు సంకేతం. టాయిలెట్ సిటు పై ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, కండరాలు పట్టేయడం వంటివి జరుగుతుంది. దీనివలన తుంటి, కాలు కండరాలు బలహీన పడే ప్రమాదం ఉంది.