ధనుష్ VS నయనతార : తెర వెనక మొత్తం నడిపించింది ఆ బడా డైరెక్టరా..? శాడిస్ట్ ఫెలో..!

frame ధనుష్ VS నయనతార : తెర వెనక మొత్తం నడిపించింది ఆ బడా డైరెక్టరా..? శాడిస్ట్ ఫెలో..!

Thota Jaya Madhuri
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో నయనతార అదేవిధంగా ధనుష్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దానికి కారణం ఎప్పుడు సైలెంట్ గా ఉండే నయనతార స్టార్ హీరో ధనుష్ పై ఒక మూడు పేజీల సంచలన ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేయడమే.  మనకు తెలిసిందే నయనతార తన పెళ్లిని ఒక డాక్యుమెంటరీలా చేయాలి అనుకుంది . దానికి సంబంధించిన పనులన్నీ కూడా తనే దగ్గర ఉండి చూసుకుంది. తాజాగా దానికి సంబంధించిన వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. అయితే తన మ్యారేజ్ డాక్యుమెంటరీ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తీరును తప్పుపడుతూ స్టార్ హీరోయిన్ నయనతార సంచలన కామెంట్స్ చేసింది .


"నానం రౌడీ దాన్" తెలుగులో వచ్చిన "నేను రౌడీనే" సినిమాను హీరో ధనుష్ నిర్మించారు . ఈ సినిమాకి డైరెక్టర్గా విగ్నేశ్ శివన్ డైరెక్టర్ గా వర్క్ చేశారు . అయితే ఈ సినిమాకు సంబంధించి జస్ట్ మూడు సెకండ్లు అంటే మూడు సెకండ్ల వీడియోను నయనతార తన పెళ్లి డాకుమెంటరీ ట్రైలర్లో వాడుకున్నారు.  అయితే ఇది ధనుష్ కి బాగా కోపం తెప్పించింది . అయితే అందరిలా చూస్తూ సైలెంట్ గా ఉండకుండా ఆయన ఏకంగా 10 కోట్ల  నష్టపరిహారం డిమాండ్ చేస్తూ కోర్టు లీగల్ నోటీసులు నయనతార -విగ్నేశ్ శివన్ కి పంపించారు.  దీంతో నయనతార ఫుల్ కోపంతో ఊగిపోయింది . ఇక అలా ఇలా కాదు అంటూ ఏకంగా సోషల్ మీడియా వేదికగా ధనుష్ నిజ స్వరూపం బయటపెట్టాలి అంటూ ఓపెన్ గానే ఆయన గురించి చెప్పుకొచ్చింది .


ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో నయనతార అదే విధంగా ధనుష్ ఇద్దరు పెద్ద స్టార్సే . మరి అలాంటిది ఇంత చిన్న విషయం వీళ్ళ మధ్య గొడవకి కారణమైందా..? అంటే కాదు అని అంటున్నారు సినీ విశ్లేషకులు . నయనతార విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని సినిమాల్లో నటించడానికి ఇష్టం చూపించడం లేదు.  మరీ ముఖ్యంగా ఒక సినిమా విషయంలో డైరెక్టర్ నయనతార ను ఒప్పించడానికి ఏకంగా ధనుష్ ని హెల్ప్ అడిగారట.


అయితే ధనుష్ కాల్ చేసి నయనతారను ఆ సినిమా చేయి అంటూ చెప్పినా కూడా ఆమె అస్సలు వినలేదట. అంత పెద్ద స్టార్ హీరో రిక్వెస్ట్ చేసిన కూడా హీరోయిన్ నయనతార అసలు ఆ మూవీని ఓకే చేయక పోవడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఒకప్పుడు ధనుష్ సినిమా కారణంగానే నయనతార కి లైఫ్ వచ్చింది . అలాంటి ధనుష్ మాటలు కూడా ఆమె వినకపోవడంతో ఆయనకు బాగా కోపం వచ్చిందట. ఆ కారణంగానే ఇప్పుడు ఆయన ఈ విధంగా రివేంజ్ తీర్చుకోవాలి అంటూ ట్రై చేస్తున్నారట . అసలు వీరిద్దరి మధ్య ఎంత గొడవ జరగడానికి కారణం ఆ సినిమా డైరెక్టర్ అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు పాత గొడవలు కూడా వీళ్ల మధ్య ఎక్కువుగా ఉన్నయ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: