మొబైల్ తో టాయిలెట్ లోకి వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే?
అసలు విషయం ఏమిటంటే... ఇలా చేయడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరైతే టాయిలెట్ కి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ తీసుకువెళ్లి ఫోన్లో చూస్తూ కూర్చుంటారో వారు ఖచ్చితంగా రోగాల బారిన పడతారని ఓ సర్వే ద్వారా తెలిసింది. టాయిలెట్లోకి ఫోన్ తీసుకు వెళ్లినప్పుడు టాయిలెట్ లో ఉండే బ్యాక్టీరియా గాలి ద్వారా మన ఫోన్ పైకి చేరుతుంది. తద్వారా చేరిన ఆ బాక్టీరియా మనం మాట్లాడుతున్నప్పుడు చేతులతో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మన చేతుల నుంచి మన కడుపులోకి చేరుతుంది. తత్పలితంగా డయేరియా, ప్రేగు సంబంధిత వ్యాధులు, మూత్ర వ్యాధులు, మరికొన్ని అంటు వ్యాధులు వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అవును, మనం రోజూ వాడే టాయిలెట్లలో మనకు తెలియకుండానే కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? బాత్రూంలో కూర్చుని ఫోన్ మాట్లాడినప్పుడు అది మన ముక్కు, నోరు ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఒక్కోసారి మలం పేగుల ద్వారా కూడా ఆ బాక్టీరియా కడుపు లోనికి చేరుకుంటుంది. ఫలితంగా రోగాల బారిన పడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా టాయిలెట్ లో కమోడ్ మీద గంటల కొద్దీ కూర్చుంటే రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మొబైల్ ఫోన్ ను వినియోగించాలనుకునేవారు అతిగా వినియోగించడం ప్రమాదం అనే విషయాన్ని గుర్తించాలి.