చలికాలంలో చర్మ రక్షణ కోసం గ్లిజరిన్.. అతిగా వాడితే ముప్పు తప్పదు..!
వీటివల్ల స్కిన్ పై తేమ నిలుపుకోవడం వల్ల స్కిన్ పాడవకుండా ఉంటుంది. కానీ ఎక్కువగా ఉపయోగించటం కూడా అంత సేఫ్ కాదంటున్నారు నిపుణులు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పెదవులు, చర్మం పగుళ్లపై గ్లిజరిన్ ను సరేనా మోతాదులో ఉపయోగించటం వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో లో మాలిక్యులర్ ఉంటుంది. స్కిన్ లోపలికి చోచ్చుకుపోయిన దుమ్ము, ధూళి కణాలను క్లీన్ చేయటంలో సహాయపడుతుంది. ఇదొక మంచి కైన్సర్ గా కూడా పని చేస్తుంది. ఇక నిద్రపోవడానికి ముందు గ్లిజరిన్ ను ముఖంపై అప్లై చేసుకుంటే సూక్ష్మ రంధ్రాలను శుభ్రపరుస్తుందని చెప్పారు. దీంతోపాటు చర్మం నిగారింపు పెరుగుతుంది.
అయితే ఇదంతా పరిమితిగా ఉపయోగించినప్పుడు మాత్రమే. చలికాలం కదా చర్మం మెరిసిపోవాలని ఉద్దేశంతో అతిగా ఉపయోగిస్తే గనుక అసలుకే మోసం రావచ్చు. చర్మం నల్లబడటం లేదా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి ఉపయోగించడానికి ముందు మీ చర్మా తత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. స్కిన్ స్పెషలిస్టుల సలహాలు పాటించటం ఉత్తమం. కాబట్టి నేను చర్మం అందంగా అవ్వాలంటే ఈ విధంగా చేయండి. చలికాలంలో ఎక్కువ బయట తిరగకండి. ఎక్కువగా బయట తిరగటం వల్ల ఫేస్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇక నిద్రపోవడానికి ముందు గ్లిజరిన్ ను ముఖంపై అప్లై చేసుకుంటే సూక్ష్మ రంధ్రాలను శుభ్రపరుస్తుందని చెప్పారు.