ఉప్పు నీటితో అస్సలు ఊహించలేని బెనిఫిట్స్..!

lakhmi saranya
మనం ఏ వంట వండుకున్నా కానీ అందులో ఉప్పు అనేది కంపల్సరీ వేయాల్సిందే. ఉప్పు లేకపోతే కర్రీస్ కూడా అంత టేస్ట్ గా ఉండవు. ఉప్పు నీటితో బెనిఫిట్స్ ఏమున్నాయని అనుకుంటున్నారా. ఈ నీటి వల్ల చాలా లాభాలే ఉన్నాయి. ఉప్పులో ఎక్కువగా అయోడిన్ ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఉప్పులో ఉండే అయోడిన్ మెదడుకు, థైరాయిడ్ గ్రంథికి మేలు చేస్తుంది. వేడి వాతావరణం లో ఉండేవారికి, అతిగా చమటలు పట్టేవారికి ఈ ఉప్పు నీరు ఉపయోగపడుతుంది.
 అలసట, నీరసంగా అనిపిస్తున్న అందుకు కారణం అయోడిన్ లేకపోవడమే. కొందరు ఉప్పును ఎక్కువగా తింటారు. తినటం వల్ల రక్తపోటు వచ్చే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. సాల్ట్ శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ను సులువుగా పునరుద్దిరిస్తుంది. ఉదయమునే పరగడుపున ఒక గ్లాస్ ఉప్పు కలిపిన నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, రక్తపోటు సమస్య ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తీసుకోవటం మంచిది. ఎండలో పనిచేసే వారికి ఈ సాల్ట్ వాటర్ మేలు చేస్తుంది. ఎందుకంటే, వీరికి బాడీలో ఉన్న నీటి శాతం, చమట రూపంలో ఎక్కువగా పోతుంది.
దీని వలన శరీరంలో ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి. అందువల్ల వీరు సాల్ట్ వాటర్ తాగటం వల్ల బాడీ బ్యాలెన్స్ అవుతుంది. గొంతు నొప్పి, గొంతు మంటతో బాధపడేవారు సాల్ట్ వాటర్ ను పుక్కిలించడం వల్ల ఉపశ్రమమం కలుగుతుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాని తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కడుపులోని జీర్ణరసాలు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఉప్పు నీటి కారణంగా పేగుల్లోకి అదనంగా నీరు చేరి మలవిసర్జనకు ఆస్కారం ఏర్పడుతుంది. జీర్ణాశయంలో ఎంజైమ్స్ ఉత్పత్తికి ఉప్పు నీరు సహాయపడుతుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు కలపడం వల్ల చర్మం పిహెచ్ బ్యాలెన్స్ బాగుంటుంది. దీనివల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా కండరాలు రిలాక్స్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: