ఆల‌స్యంగా ప‌డుకొని త్వ‌ర‌గా నిద్ర‌మేల్కొంటే వ‌చ్చే స‌మ‌స్య‌లివే..?

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. కెరీర్ పరంగా ముందు ఉండాలన్న కోరిక, ఆర్థికపరమైన భద్రత, జీవితంలో సెటిల్ కావటం చాలా కారణాలు మనిషిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీంతో సరైన నిద్ర ఉండటం లేదు. ఇది మానవ జీవన విధానంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఆలస్యంగా పడుకుని తొందరగా మేల్కొనే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే.. వారంలో ఏదో ఒక రోజు ఫంక్షన్ అనో, పార్టీ అనో.. లేదా పని ఎక్కువ ఉందనో ఆలస్యంగా పడుకుంటే సరే. రోజు ఆలస్యంగా పడుకుని తొందరగా మేలుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

తక్కువ నిద్రపోవటం వల్ల ఒత్తిడి అనిపించే కార్డిస్టాల్‌ స్థాయిలో పెరుగుతాయి. దీంతో ఆందోళనతో పాటు భావోద్వేగాలు అదుపులో ఉండవు. జలుబు వంటివి తరచూ ఇబ్బంది పెడతాయి. తక్కువ నిద్ర కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. సరిపడా నిద్ర లేకపోతే ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఆలోచన సామర్థ్యం కోల్పోతారు. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. రోజూ చేసే పనే అయినా కష్టంగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి లేకపోతే జ్ఞాపకశక్తిని కోల్పోతారు. కొత్త విషయాలు నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఓపిక, ఆసక్తి ఉండవు.

నిద్ర లేమితో చిన్న చిన్న విషయాలకి కోపం అసహనం వస్తాయి. నిద్ర లేమి ప్రభావం జీర్ణవ్యవస్థ పైన పడుతుంది. గ్రీన్ అనే హార్మోన్ పెరగటం వల్ల ఎక్కువ ఆకలి వేస్తుంది. అధిక బరువుకు కారణమయ్యే తీపి పదార్థాలు, మసాలాలతో కూడిన ఆహారం తినాలనిపిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సరిపడా నిద్ర అవసరం. నిద్రలేమి కారణంగా ముఖంపై ముడతలు, మచ్చలు.. కళ్ళ‌ కింద నల్లటి వలయాలు, వృద్ధాప్య చాయ‌లు కనిపిస్తాయి. అలాగే హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిద్రలేమి అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. ఈ సమస్య దీర్ఘకాలంగా కొనసాగితే గుండు పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: